సీఎంఆర్‌ బకాయిలు ఉంటే కేటాయింపులు ఇవ్వొద్దు | - | Sakshi
Sakshi News home page

సీఎంఆర్‌ బకాయిలు ఉంటే కేటాయింపులు ఇవ్వొద్దు

Jul 31 2025 7:28 AM | Updated on Jul 31 2025 9:16 AM

సీఎంఆర్‌ బకాయిలు ఉంటే కేటాయింపులు ఇవ్వొద్దు

సీఎంఆర్‌ బకాయిలు ఉంటే కేటాయింపులు ఇవ్వొద్దు

భానుపురి (సూర్యాపేట) : సీఎంఆర్‌ పెండింగ్‌ ఉన్న మిల్లులకు వచ్చే సీజన్‌లో కేటాయించేది లేదని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ రాంబాబు, పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి 2023 – 24 సీఎంఆర్‌ పెండింగ్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో బకాయిలు పెండింగ్‌లో ఉన్న మిల్లర్లు గడువులోగా ధాన్యాన్ని అందించాలని ఆదేశించారు. బకాయి ఉన్న మిల్లర్లు 100శాతం బ్యాంక్‌ గ్యారంటీ ఇస్తేనే ఆ మిల్లులకు సీఎంఆర్‌ కేటాయించడం జరుగుతుందని తెలిపారు. మిల్లర్లు ధాన్యాన్ని వేగంగా అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో డీఎస్‌ఓ మోహన్‌ బాబు, ఏసీఎస్‌ఓ శ్రీనివాస్‌ రెడ్డి, ఏఎం బెనర్జీ, డీటీలు, ఆర్‌ఐ లు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement