
ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి
తిరుమలగిరి : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని డీఐఈఓ బాలునాయక్ అన్నారు. బుధవారం తిరుమలగిరి మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాణ్యమైన విద్య అందుతుందని, విద్యార్థులను ప్రభుత్వ కళాశాలలకు పంపించాలని కోరారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సిపాల్ మృత్యుంజయ, రాజమోహన్, శ్రీనివాస్ తదితరులున్నారు.
ప్రాథమిక
ఆరోగ్య కేంద్రం తనిఖీ
గరిడేపల్లి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం కేంద్ర ప్రభుత్వ కుటుంబ సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ పర్వీన్ సందర్శించారు. జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంతో పాటు మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ప్రస్తుత సీజన్‌లో వచ్చే వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆమె వెంట వైద్యాధికారి నరేష్, డీపీఓ ఉమ, ఎన్‌సీడీ కో ఆర్డినేటర్ సాంబశివరావు, హెల్త్ సూపర్‌వైజర్ అంజయ్యగౌడ్, ఏఎన్‌ఎం కవిత, బాలకృష్ణ ఉన్నారు.
1న చేయూత
పింఛన్‌దారుల మహాసభ
సూర్యాపేట అర్బన్ : హుజూర్‌నగర్‌లో వచ్చేనెల 1న జరిగే చేయూత పింఛన్‌దారుల జిల్లా సన్నాహక మహాసభను జయప్రదం చేయాలని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న మాదిగ అన్నారు. బుధవారం పిల్లలమర్రి గ్రామంలో చేయూత పెన్షన్‌దారులు, వికలాంగులకు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు పెంచాలని ఆగస్టు 13న హైదరాబాద్‌లో జరిగే వికలాంగుల చేయూత పింఛన్ల మహాగర్జన సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ మేరకు ఆగస్టు 1న హుజూర్‌నగర్‌లో వికలాంగుల చేయూత పింఛన్‌దారుల సన్నాహక మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సమైక్య రాష్ట్ర కోశాధికారి చింత జాన్ విల్సన్ మాదిగ, ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకుపల్లి ఎల్లయ్య, సందీప్ పాల్గొన్నారు.

ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి

ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి