
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలి
చిలుకూరు: విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ ఉన్నత లక్ష్యంతో చదువుకుని మంచి భవిష్యత్‌కు పునాదులు వేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. మంగళవారం చిలుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్‌లో జిల్లా ప్రథమ, ద్వితీయ ర్యాంకులు సాధించిన పాఠశాల విద్యార్థులు రవి, చైత్రను కలెక్టర్ అభినందించారు.
అంగన్‌వాడీలో భోజనం చేసిన కలెక్టర్
చిలుకూరు అంగన్‌వాడీ కేంద్రం–4ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో చిన్నారులు భోజనం చేస్తుండగా పిల్లలతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. దరణి అనే చిన్నారి జిల్లాల పేర్లు చెప్పడంతో కలెక్టర్ ఆ చిన్నారిని, అంగన్‌వాడీ టీచర్ సిరికొండ కవితను అభినందించారు.
పీహెచ్‌సీ, పశువైద్యశాల తనిఖీ
చిలుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రం ప్రహరీ కూలి పోవడంతో వెంటనే నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పశు వైద్యశాలను తనిఖీ చేశారు. తహసీల్దార్ ధృవకుమార్, ఎంపీడీఓ గిరిబాబు, ఆర్‌ఐ సీతా రామచందర్‌రావు, డాక్టర్ సుశీల, కార్యదర్శి షరీఫుద్దీన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవర్