
వీసీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
యూనివర్సిటీకి చెందిన అన్ని వివరాలను వైస్ చాన్స్‌లర్ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యా కమిషన్ బృందానికి వివరించారు. యూనివర్సిటీలోని ప్రస్తుత స్థితిగతులను బృందం సభ్యులకు ప్రత్యక్షంగా చూపించారు. అదేవిధంగా విద్యార్థులు తమ హాస్టల్‌లో కల్పించాలని వసతులు, సమస్యలు, పోటీ పరీక్షలకు వెసులుబాటు తదితర వాటిపై కమిషన్ బృందానికి విన్నవించారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యా కమిషన్‌ను కలిసి నాలుగేళ్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల వలన ఎదుర్కొంటున్న ఇబ్బందులను విద్యా కమిషన్ బృందానికి వివరించారు.