
సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలి
త్రిపురారం : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు ఇప్పటికే వరి నాట్లు పూర్తి చేసుకున్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టు కింద సైతం సాగు నీరు విడుదల కావడంతో ఇప్పటికే నాట్లు పూర్తి చేసుకోగా.. పలు ప్రాంతాల్లో ముమ్మరంగా వరి నాట్లు వేయడంలో బిజీగా ఉన్నారు. వరి పంటల సాగులో రసాయని ఎరువుల వాడకం తగ్గించుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రసాయనక ఎరువులు వినియోగించడం వల్ల భూమి సారం దెబ్బతినడంతో పాటుగా పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. రసాయనిక ఎరువల వాడకం తగ్గించుకోవాలని కేంద్ర, రాష్త్ర ప్రభుత్వాలు సైతం వ్యవసాయ శాస్త్రవేత్తల సహాయంతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. వరి సాగులో ఎరువులు, పోషకాల యాజమాన్యంపై కేవీకే సేద్యపు విబాగం శాస్త్రవేత్త డాక్టర్ చంద్ర శేఖర్ సూచనలు.
ఫ భూసార పరిరక్షణకు రసాయనిన ఎరువుల వాడకం తగ్గించుకుని సేంద్రియ, జీవన ఎరువులు ఉపయోగించుకోవాలి. సేంద్రియ ఎరువులు వినియోగించడం వల్ల భూసారం పెరగడమే కాకుండా పోషకాల లభ్యత కూడా పెరుగుతుంది.
ఫ వరి మాగాణుల్లో అపరాలు, జీలుగా, పిల్లి పెసర లాంటి పచ్చి రొట్ట పైర్లను పెంచి పూత దశకు ముందు కలియదున్నడం వల్ల భూసారం పెరగడమే కాకుండా సుమారు 20 నుంచి 25 శాతం వరకు నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులు ఆదా చేయొచ్చు.
ఫ భూసార పరీక్షల ఆధారంగా నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు వాడుకోవాలి.
ఫ నత్రజని వినియోగాన్ని పెంచుకోవడానికి 50 కిలోల యూరియాకి 10 కిల్లో వేప పిండి లేదా 250 కిలోల తేమ కలిగిన బంక మట్టిని కలిపి రెండు రోజులు నిల్వ ఉంచి వరి పొలంలో వేద జల్లితే నత్రజని వినియోగం పెరుగుతుంది.
ఫ పురుగులు, మరియు తెగుళ్ల ఎక్కువగా ఉన్నప్పుడు నత్రజని ఎరువు వాడకం తగ్గించుకోవాలి.
ఫ భాస్వరం ఎరువులను పొలం దమ్ములోనే వేసుకోవాలి. దమ్ములో వేయకపోతే నాటు వేసిన పది రోజుల లోపు వేసుకోవాలి.
యూరియా వినియోగంతో చీడపీడల
ఉధృతి పెరుగుతుంది
వరి పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే పంటలకు కావాల్సిన పోషకాలను సరైన మోతాదులో సకాలంలో అందించాలి. పొటాష్ ఎరువులను రేగడి నేలల్లో ఆఖరి దమ్ములో ఒకేసారి వేసుకోవాలి. యూరియాను ఎక్కువగా వినియోగిస్తే చీడపీడల ఉధృతి పెరుగుతుంది. చీడపీడల వల్ల తాలు కంకులు ఏర్పటి దిగుబడి తగ్గడమే కాకుండా పంట నాణ్యత దెబ్బతింటుంది. ప్రతి రైతు తన పొలంలో మట్టిని ప్రతి రెండేళ్లకు ఒక్కసారైన పరీక్ష చేయించుకొని ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. సేంద్రియ, జీవన ఎరువుల వినియోగం పెంచుకోవాలి.
ఫ వరిసాగులో కేవీకే సేద్యపు విభాగం శాస్త్రవేత్త చంద్రశేఖర్ సూచనలు

సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలి