
అత్యాధునిక సౌకర్యాలు
108 వాహనంలో..
నిడమనూరు : అత్యవసర సేవలు అందించే 108 అంబులెన్స్ వాహనంలో ఆధునిక సౌకర్యాలు కల్పించారు. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు, పాయిజన్, ప్రసవ సేవలు, అనారోగ్యానికి గురైన వ్యక్తిని వాహనంలో ఆస్రత్రికి తరలించేలోగా పలు అత్యవసర సేవలందించేలా 108 వాహనంలో వసతులు ఏర్పాటు చేశారు. ఇటీవల నిడమనూరుకు ఈ కొత్త అంబులెన్స్ వాహనాన్ని కేటాయించారు.
వాహనంలో ఉన్న వసతులు ఇవీ..
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్ ఆరోగ్య పరిస్థితి సమీక్షించేందుకు మల్టీపుల్ చానల్ మానిటర్ ఏర్పాటు చేశారు. దీనితో బీపీ, పల్స్ రేట్, సాచ్యురేషన్ పేషెంట్ కండిషన్ తెలిపేందుకు ఇది దోహదపడుతుంది. అదేవిధంగా పురుగుల మందు తాగి వారికి కడుపులో ఉన్న విషం తొలగించేలా స్టమక్ క్లీనర్ ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదం బారిన పడిన క్షతగాత్రులకు ఉపయోగపడే అత్యవసర మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా పొర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేశారు. బాధితుడు శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు తలెత్తితే పొర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్ సాయంతో ఆక్సిజన్ అందిస్తారు. ఆస్పత్రికి తరలించే వరకు ఎంతగానో దోహదపడుతోంది. అత్యవసర ప్రసవ సమయాల్లో సేవలందించేలా డెలివరీ కిట్స్ ఉన్నాయి.
పేషెంట్ ఆరోగ్య పరిస్థితి
పరిశీలించేందుకు మల్టీచానల్
మీటర్ సదుపాయం
అందుబాటులో స్టమక్ క్లీనర్‌తోపాటు,
అత్యవసర మందులు, ఇంజెక్షన్లు