
నేడు హుజూర్‌నగర్‌కు మంత్రి ఉత్తమ్ రాక
హుజూర్‌నగర్ : రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం హుజూర్‌నగర్‌కు రానున్నారు. మధ్యాహ్నం 12.45 గంటలకు హెలికాప్టర్‌లో హుజూర్‌నగర్‌కు చేరుకుంటారు. 1:30 గంటలకు స్థానిక కౌండిన్య ఫంక్షన్ హోల్‌లో నూతన రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొంటారు. అనంతరం 1.45 గంటలకు హెలికాప్టర్‌లో నకిరేకల్‌కు వెళతారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగొద్దు
సూర్యాపేటటౌన్ : బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, ధూమపానం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కె.నరసింహ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా నిఘా ఉంచామని, అక్రమ సిట్టింగ్‌లు, బహిరంగంగా మద్యం, సిగరెట్ తాగడం లాంటి అసాంఘిక చర్యలకు పాల్పడొద్దని పేర్కొన్నారు. మైనర్లకు మద్యం, పొగాకు ఉత్పత్తుల లాంటి మత్తు పదార్థాలను అమ్మవద్దని సూచించారు. వీటి వల్ల పిల్లలు చెడు వ్యసనాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి
చివ్వెంల : న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషిచేస్తానని తెలంగాణ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ పి.సునిల్ గౌడ్ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. న్యాయవాదులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలను బార్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. అంతకుముందు సునిల్‌గౌడ్‌ను సన్మానించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, న్యాయవాదులు నాతి సవీందర్ కుమార్, మోదుగు వెంకట్‌రెడ్డి, బానాల విజయ్ కుమార్, సోమేష్ కుమార్, బత్తిని వెకటేశ్వర్లు, పొదిల ప్రదీప్ కుమార్, పంతంగి కృష్ణ, వసంత సత్యనారాయణ పిళ్లే యాదవ్, కంచర్ల సతీష్ కుమార్, కట్ట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన బోధన
అందించాలి
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి (డీఐఈఓ) భానునాయక్ అన్నారు. సోమవారం సూర్యాపేటలోని జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయంలో కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలల్లో అయిన అడ్మిషన్లు, డైస్, అపార్, ఆదర్శ కమిటీల ఏర్పాటుతోపాటు తదితర అకడమిక్‌కు సంబంధించి వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం ప్రిన్సిపాళ్లుగా పదోన్నతిపై జిల్లాకు వచ్చిన బచ్చలకూరి మృత్యుంజయ (తిరుమలగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల) హరిప్రసాద్ (నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల)ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాళ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
30న జాబ్‌మేళా
నల్లగొండ : నిరుద్యోగ యువతకు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 30న ఉదయం 10:30 గంటలకు నల్లగొండలోని ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. ఎస్‌ఎస్‌సీ నుంచి ఏదేని డిగ్రీ, డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి 18 నుంచి 30 ఏళ్ల వయసు గల అభ్యర్థులు వారి ఒరిజినల్స్, బయోడేటాతో హాజరు కావాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 78934 20435 ఫోన్‌లో సంప్రదించాలని సూచించారు.

నేడు హుజూర్‌నగర్‌కు మంత్రి ఉత్తమ్ రాక

నేడు హుజూర్‌నగర్‌కు మంత్రి ఉత్తమ్ రాక