
వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణిలో వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో గ్రామాలు, వార్డుల్లో ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులు చేయాలన్నారు. , సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి అర్జీకి సంబంధించి కచ్చితమైన సమాధానంతో కూడిన కాపీని అర్జీదారునికి పంపాలన్నారు. అలా చేయకపోతే ప్రజలు ఒకే సమస్యపై మరలా దరఖాస్తు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ వీవీ.అప్పారావు, డీఎఫ్‌ఓ సతీష్‌కుమార్, డీఈఓ అశోక్, డీఏఓ శ్రీధర్‌రెడ్డి, డీసీఓ పద్మ, డీఎస్‌ఓ మోహన్‌బాబు, సంక్షేమ అధికారులు దయానందరాణి, శ్రీనివాస్ నాయక్, శంకర్, జగదీశ్వరరెడ్డి, కలెక్టరేట్ ఏఓ సుదర్శన్‌రెడ్డి, సూపరింటెండెంట్లు సాయిగౌడ్, సంతోష్ కిరణ్, అధికారులు పాల్గొన్నారు.
పూర్వ విద్యార్థుల చేయూత అభినందనీయం
చివ్వెంల : తాము చదువుకున్న పాఠశాలకు చేయూతనందించడం అభినందనీయమని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. చివ్వెంల మండలం కొండల రాయినిగూడెం గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాలలో చదువుకుని వివిధ హోదాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు సోమవారం అదే పాఠశాలలో పలువురు విద్యార్థులకు జిల్లా కలెక్టర్ చేతులు మీదుగా టీషర్ట్‌లు, షూస్ పంపణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీవితంలో స్థిరపడి మాతృభూమికి సేవచేయడం గర్వకారణమన్నారు. కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు రెండవ తరగతి విద్యార్థి వినయ్ ఇంగ్లిష్‌లో సమాధానం చెప్పగా, ఐదవ తరగతి విద్యార్థిని శ్రీనిధి తెలుగు స్పష్టంగా చదివింది. దీంతో వారిని కలెక్టర్ అభినందించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలు, బాలింతలు, గర్భిణుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రకాశ్‌రావు, ఎంఈఓ కళారాణి, హెచ్‌ఎం నవీన్‌కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఫ సీజనల్ వ్యాధులపై ప్రజలకు
అవగాహన కల్పించాలి
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్

వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరించాలి