
పాత నేరస్తుల కదలికపై నిఘా ఉంచాం : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : పాత నేరస్తులు, అనుమానితుల కదలికలపై నిఘా ఉంచామని ఎస్పీ కె.నరసింహ అన్నారు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలోని పలు సెంటర్లలో స్కానర్‌తో అనుమానితులను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన భద్రత కల్పించడం లక్ష్యంగా జిల్లా కేంద్రంలో పాత నేరస్తులు, అనుమానితులు ఎవరైనా సంచరిస్తున్నారా అనే కోణంలో తనిఖీలు చేశామన్నారు. వ్యాపార సముదాయాలు, షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వ్యక్తిగత గుర్తింపు కార్డులు లేకుండా ఎవరికి నివాసాలు అద్దెకు ఇవ్వొద్దన్నారు. అనుమానితుల సమాచారాన్ని డయల్ 100 ద్వారా పోలీసులకు తెలియజేయాన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ వెంకటయ్య, ఎస్‌ఐలు పాల్గొన్నారు.