
నేడు తెరుచుకోనున్న మూసీ గేట్లు
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు క్రస్టుగేట్లను శుక్రవారం ఉదయం 8గంటలకు ఎత్తి నీటిని దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. మూసీకి గురువారం 1,427 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా 643.20 అడుగుల (4.07టీఎంసీల)కు చేరుకుంది. ఈ నేపథ్యంలో మూసీ క్రస్టు గేట్లు పైకెత్తుతామని అధికారులు గురువారం రాత్రి ప్రకటించారు. ఆయకట్టులో పంటల సాగుకు కుడి ప్రధాన కాల్వకు 143 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 214.86 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అయితే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని మూసీ తీర ప్రాంత గ్రామాల రైతులు అప్రమత్తంగా ఉండాలని మూసీ ప్రాజెక్టు అధికారులు సూచించారు.