
మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ తనిఖీలు
కోదాడరూరల్: మేళ్లచెర్వు మండలం రామాపురంలో కల్తీ మద్యం తయారీ గుట్టురట్టవ్వడంతో కోదాడ ఎకై ్సజ్ పోలీసులు మంగళవారం కోదాడ పట్టణంలోని మద్యం దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పట్టణంలోని సూర్యాపేట రోడ్డులో ఉన్న ఎస్‌ఎస్ మద్యం దుకాణంలో అనుమానాస్పదంగా ఉన్న పలు మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ మద్యం సీసాలను వరంగల్‌లోని ఎకై ్సజ్ శాఖ కెమికల్ ల్యాబ్‌కు పంపించి మద్యంలో కల్తీ జరిగిందా లేదా అనే విషయాలను తెలుసుకుంటామని ఎకై ్సజ్ పోలీసులు తెలిపారు. మద్యంలో కల్తీ జరిగినట్లు నిర్ధారణ జరిగితే ఆ షాపుపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉంటే కోదాడ మద్యం దుకాణాల్లో కూడా కల్తీ మద్యం విక్రయాలు జరగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. షాపుల వద్ద తాగే వారికి ఈ నకిలీ మద్యం సీసాలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారని మందుబాబులు అంటున్నారు. మద్యం దుకాణాలపై ఎకై ్సజ్‌శాఖ ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహిస్తే నకిలీ మద్యం అమ్మకాలు బయటకు వస్తాయని చెబుతున్నారు.