
సమగ్ర వ్యవసాయ ప్రణాళిక ప్రకటించాలి
నాగారం : రాష్ట్ర ప్రభుత్వం వానాకాలానికి సంబంధించి సమగ్ర వ్యవసాయ ప్రణాళికను ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నాగారంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏ భూమిలో ఏ పంట పండుతుందో ప్రజలకు ఎంత పంట అవసరమో అంచనా వేసి వాటికి కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులను అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కమిటీ సభ్యుడు పులుసు సత్యం, నాగారం, అర్వపల్లి మండలాల కార్యదర్శులు దేవరకొండ యాదగిరి, వజ్జా శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా నాయకుడు సిగ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.