
జగదీష్‌రెడ్డిపై విమర్శలు చేయడం సిగ్గుచేటు
సూర్యాపేటటౌన్ : రెండేళ్లలో ఒక్క శాతం అభివృద్ధి చేయని కాంగ్రెస్ ప్రభుత్వం.. వందశాతం అభివృద్ధి చేసిన మాజీ మంత్రి జగదీష్‌రెడ్డిపై విమర్శలు చేయడం సిగ్గు చేటని, ఎవరి అభివృద్ధి ఎంతో చర్చకు వస్తే తేల్చుకుందామని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాలకు రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించి చెరువులు కుంటలు నింపి దేశంలోనే అత్యధిక పంట దిగుబడి సాధించిన ఘనత జగదీష్‌రెడ్డిది అనే విషయాన్ని మర్చిపోవద్దని తెలిపారు. సమావేశంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, నాయకులు గోపగాని వెంకటనారాయణ గౌడ్, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, పెరుమాళ్ల అన్నపూర్ణ, సవరాల సత్యనారాయణ, పుట్ట కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్