
షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చాలి
భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ అసెంబ్లీ చట్టం చేసిన బీసీ రిజర్వేషన్ బిల్లును తక్షణమే కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ 9లో చేర్చాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ నాయుడు డిమాండ్ చేశారు. మంగళవారం బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 2019లో అగ్రవర్ణాల పేదల కోసం అంటూ 103వ రాజ్యాంగ సవరణ చేసి పది శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి పార్లమెంట్‌లో బిల్లు తెచ్చి రిజర్వేషన్ అమలు చేస్తున్న విధంగానే 2025లో కులగణన చేసి జనాభా దామాషా ప్రకారం బీసీలకు 50శాతం విద్యా ఉద్యోగ, చట్టసభల్లో రిజర్వేషన్లు అమలు చేయడానికి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో బూర వెంకటేశ్వర్లు, చామల అశోక్, కనకయ్య, చిలకరాజు శ్రీను, ఇనుగుర్తి వెంకటరమణాచారి, నిగడాల వీరయ్య, కొండ అన్నపూర్ణ, మండవ నాగమణి, వెంకట్, సిరాపురపు శ్రీనివాస్ దేశగాని హేమలత దేశ గాని సైదులు పాల్గొన్నారు.