
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
మునగాల: బీజేపీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం మునగాలలో మండల పార్టీ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. మండల శాఖ అధ్యక్షుడు మైలార్‌శెట్టి నాగేశ్వరరావు అధ్యక్షతన పూలమాలలు, శాలవాలతో ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం పనిచేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, రాష్ట్ర నాయకులు సంకినేని వెంకటేశ్వరరావు, కేతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మండల పార్టీ నాయకులు భద్రంరాజు కృష్ణప్రసాద్, శ్రీనివాసరెడ్డి, వీరబాబు, వినోద్, గోవిందాచారి, మండవ సైదులు, ఆర్.సైదులు పాల్గొన్నారు.