వికాసం.. ఆలస్యం! | - | Sakshi
Sakshi News home page

వికాసం.. ఆలస్యం!

Jun 20 2025 5:25 AM | Updated on Jun 20 2025 5:25 AM

వికాసం.. ఆలస్యం!

వికాసం.. ఆలస్యం!

భానుపురి (సూర్యాపేట) : రాజీవ్‌ యువవికాసం యూనిట్ల మంజూరులో సందిగ్ధత నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 16,738 యూనిట్లు లక్ష్యం కాగా 60,304 దరఖాస్తులు వచ్చాయి. జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొంతమందికి మంజూరు పత్రాలు ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మండల స్థాయిలోనే ఓ కొలిక్కి రానట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం యూనిట్ల మంజూరు పత్రాల పంపిణీని నిలిపివేసింది. ఇప్పుడు వీరందరికీ ఎదురుచూపులు తప్పడం లేదు.

60,304 దరఖాస్తులు

రాజీవ్‌ యువ వికాసం పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.50వేల నుంచి రూ.4లక్షల వరకు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 16,738 మందికి రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటికోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 16,738 యూనిట్ల లక్ష్యానికి ఏకంగా 60,304 యూనిట్ల కోసం దరఖాస్తులు రావడంతో మండల స్థాయిలో ఎంపిక చేయాలని నిర్ణయించారు.

కొలిక్కిరాని జాబితాలు..

రుణాల కోసం వచ్చిన దరఖాస్తుల నుంచి మండల స్థాయిలోనే అర్హుల జాబితాలను సిద్ధం చేయాల్సి ఉంది. ఈ జాబితాలు జిల్లాస్థాయికి పంపిస్తే .. అక్కడ బడ్జెట్‌ అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉంది. కానీ మండల లెవల్‌ కమిటీలు తుది జాబితాలను పూర్తి చేయడంలో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఈ కమిటీలో ఎంపీడీఓ, మండల స్థాయి డీఆర్‌డీఏ సిబ్బంది, బ్యాంక్‌ సిబ్బంది ఉండగా.. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఇంకా తుది జాబితాలు సిద్ధం కాలేదని సమాచారం. ఈ నేపథ్యంలో జాబితాలు ఎప్పుడు పూర్తవుతాయి..? మంజూరు పత్రాలు ఎప్పుడు ఇస్తారోనని దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు.

సందిగ్ధంలో రాజీవ్‌ యువవికాసం లబ్ధిదారులు

ఫ జూన్‌ 2వ తేదీనే చెక్కుల పంపిణీ అంటూ హడావుడి

ఫ అర్ధంతరంగా నిలిపివేత

ఫ మండల స్థాయిలోనే కొలిక్కిరాని ఎంపికలు

ఫ జిల్లా వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులు 60,304

ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది :

రాజీవ్‌ యువ వికాసం పథకానికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ప్రభుత్వం నుంచి రాలేదు. ఇంకా తుది జాబితా కూడా పూర్తికాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇస్తాం.

–శ్రీనివాస్‌నాయక్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ

రుణం యూనిట్లు వచ్చిన

లక్ష్యం దరఖాస్తులు

రూ. 50వేలు 5,477 886

రూ. లక్ష 4,139 1431

రూ. 2లక్షలు 3537 7361

రూ. 2–4 లక్షల వరకు 3,429 50,602

ఎస్సీకార్పొరేషన్‌ రుణం 156 24

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement