లైసెన్స్‌డ్ సర్వేయర్లకు శిక్షణ
భానుపురి (సూర్యాపేట) : భూ భారతి చట్టం అమలులో భాగంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామక ప్రక్రియ చేపట్టింది. దీంట్లో భాగంగా ఇప్పటికే ఎంపిక చేసిన వారికి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. లైసెన్స్‌డ్ సర్వేయర్ల కోసం దరఖాస్తుదారులు స్వీకరించారు. ఎంపికై న వారి మొదటి జాబితాను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. వీరికి ఈనెల 26 నుంచి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
భూ సమస్యల పరిష్కారం దిశగా..
భూ సమస్యలు, ఇతర భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి రిజిస్ట్రేషన్లు సమయంలో భూ నక్ష సమర్పించాలని ప్రభుత్వం నిబంధన విధించింది. అయితే ప్రభుత్వ సర్వేయర్ల కొరత దృష్ట్యా లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం జిల్లాల వారీగా ఈనెల 17వ వరకు నిరుద్యోగ అభ్యర్థుల నుంచి మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. జిల్లా వ్యాప్తంగా 519 మందికిపైగా దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో ఎవరిని ఎంపిక చేస్తారో తెలియని అయోమయం అభ్యర్థులను వెంటాడింది. దరఖాస్తు సమయంలోనే నిర్ణీత ఫీజుకు వసూలు చేయడంతో అందరినీ శిక్షణకు ఎంపిక చేయాలని డిమాండ్ వినిపించింది. అయితే తొలి విడతలో జిల్లావ్యాప్తంగా 257 మందిని శిక్షణకు ఎంపిక చేసిన ప్రభుత్వం మరో విడత మిగతా వారికి శిక్షణ ఇచ్చే దిశగా కార్యాచరణ రూపొందించింది. మొదట్లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తెలంగాణ సర్వే ట్రైనింగ్ అకాడమీలో రెండు నెలల పాటు శిక్షణ ఉంటుందని పేర్కొన్నప్పటికీ తాజాగా జిల్లా కేంద్రంలోని శిక్షణకు ఏర్పాట్లు చేయడంతో అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలి
లైసెన్‌న్స్‌డ్ సర్వేయర్ల మొదటి జాబితా విడుదల కాగా వీరికి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్‌వీ డిగ్రీ కళాశాలలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 50 రోజుల పాటు ఈ శిక్షణ ఉండనుంది. ఉదయం 10 గంటలకు శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో పాటు లైసెన్స్‌డ్ సర్వేయర్ల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న ఫారాలను తీసుకొని రావాల్సి ఉంది. అయితే మొదటి విడతలో ఎంపిక చేసిన అభ్యర్థులకు శిక్షణ పూర్తయిన తర్వాత.. రెండో విడతలో అభ్యర్థులను ఎంపిక చేసి ఆగస్టు మాసంలో శిక్షణ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదట విడతలో శిక్షణ పొందిన సర్వేయర్ల సేవలను వినియోగిస్తూనే రెండో విడతలో ఎంపికైన వారికి శిక్షణ ఇవ్వనున్నారు.
ఫ సూర్యాపేటలో నేటి నుంచి ప్రారంభం
ఫ ఎస్‌వీ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి
ఫ 50 రోజుల పాటు కార్యక్రమం
ఫ తొలి విడతలో 257 మందికి
అవకాశం
లైసైన్స్‌డ్ సర్వేయర్లకు వచ్చిన అర్జీలు 519
మొదటి విడత ఎంపికై న వారు 257
శిక్షణ ఇవ్వనున్న రోజులు 50


