స్థానిక సైరన్‌ మోగెన్‌ | - | Sakshi
Sakshi News home page

స్థానిక సైరన్‌ మోగెన్‌

Oct 15 2026 11:35 AM | Updated on Oct 15 2026 11:35 AM

శ్రీకాకుళం

గురువారం శ్రీ 15 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

స్థానిక సంగ్రామానికి నగారా మోగింది. జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చేసింది. కానీ, శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికలకు మాత్రం బ్రేక్‌ పడింది. అదే తరహాలో ఆమదాలవలస మున్సిపాల్టీ కూడా ఎఫెక్ట్‌ అయింది. విలీన పంచాయతీల వివాదాన్ని హైకోర్టు కొట్టేయడంతో కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో మళ్లీ ఎన్నికలు ఇరకాటంలో పడ్డాయి. తదుపరి తీర్పుకు లోబడి వ్యవహరించాలని ప్రభుత్వానికి నోటీసు జారీ చేయడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం పునరాలోచనలో పడి శ్రీకాకుళం కార్పొరేషన్‌, ఆమదావలస మున్సిపాల్టీలను పక్కన పెట్టి షెడ్యూల్‌ విడుదల చేసింది. మున్సిపల్‌, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల సుదీర్ఘ షెడ్యూల్‌తో ఒకేసారి పల్లెలు, పట్టణాలు ఎన్నికల మూడ్‌లోకి వచ్చేశాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి(మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌) సైతం అమల్లోకి రావడంతో రాజకీయ సమీకరణాలు జోరందుకున్నాయి.

ఎన్నికల సందడి..

జిల్లాలోని పలాస, ఇచ్ఛాపురం మున్సిపాల్టీలతో పాటు 30 జెడ్పీటీసీ స్థానాలు, 542 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేసింది. 910 పంచాయతీలకు కూడా షెడ్యూల్‌ విడుదలైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీల రిజర్వేషన్లు కూడా విడుదలయ్యాయి. ఒకదాని తర్వాత ఒకటి ఎన్నికలు జరగనుండటంతో జిల్లాలో రాజకీయం హీటెక్కనుంది. అర్బన్‌, పల్లె పోరు అత్యంత ఆసక్తికరంగా మారనుంది.

శ్రీకాకుళం, ఆమదాలవలసకు విలీన గండం..

మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు

శ్రీకాకుళం నగరపాలక సంస్థకు, ఆమదాలవలస మున్సిపాల్టీకి ఎన్నికల గండం నుంచి ఇంతవేగంగా బయటపడే అవకాశం కన్పించడం లేదు. ఇటీవల విలీన పంచాయతీల నుంచి వేసిన పిటీషన్లను హైకోర్టు కొట్టివేసినప్పటికీ సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లడంతో వివాదం మళ్లీ మొదటకొచ్చింది. ఎన్నికల ప్రక్రియ ఒకవైపు జరుగుతుండగానే, మరోవైపు సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఆదేశాలతో బ్రేక్‌ పడింది. విలీనం పంచాయతీల విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేయడంతో పాటు సుప్రీంకోర్టులో నెల రోజుల్లోపు అప్పీలు చేసుకోవచ్చని తీర్పు ఇచ్చింది. దీంతో ఈనెల 8న కుశాలపురం పంచాయతీకి చెందిన కొందరు సుప్రీంకోర్టులో పిటీషన్‌ వేశారు. అత్యున్నత న్యాయస్థానం ఆ పిటీషన్‌ను స్వీకరించింది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీల విలీనం అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. న్యాయస్థానం ఇచ్చే తుది తీర్పునకు లోబడి పంచాయతీల విలీనం ఉండాలని స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీలో గ్రామసభ తీర్మానం లేకుండా ఏకగ్రీవంగా విలీనం చేసినట్టు కుశాలపురం పంచాయతీకి చెందిన వారు సుప్రీంకోర్టు ఆశ్రయించిన దానిపై నోటీసు జారీ చేసింది. ఇదే సూత్రం ఆమదాలవలస మున్సిపాల్టీకీ వర్తించనుండటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమదాలవలస పురపాలక సంస్థ ఎన్నికల జోలికి పోకుండా షెడ్యూల్‌ విడుదల చేసింది.

జిల్లాలో స్థానిక సంగ్రామం

అమల్లోకి ఎన్నికల కోడ్‌

పలాస, ఇచ్ఛాపురం మున్సిపాల్టీలకు

ఈ నెల 28న ఎన్నికలు

శ్రీకాకుళం మున్సిపల్‌ కార్పొరేషన్‌,

ఆమదాలవలస మున్సిపాలిటీలకు బ్రేక్‌

జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు నవంబర్‌ 3న ఎన్నికలు

పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు

నోటిఫికేషన్‌ విడుదల అక్టోబర్‌ 14

ఎన్నికల నోటీసు అక్టోబర్‌ 16

నామినేషన్ల స్వీకరణ అక్టోబర్‌ 18

పరిశీలన అక్టోబర్‌ 19

ఉప సంహరణ అక్టోబర్‌ 21

ఎన్నికలు అక్టోబర్‌ 28

ఫలితాలు అక్టోబర్‌ 30

నామినేషన్ల

ఉపసంహరణ అక్టోబర్‌ 27

ఎన్నికలు నవంబర్‌ 3

రీపోలింగ్‌ నవంబర్‌ 4

ఎన్నికల

ఫలితాలు నవంబర్‌ 5

ఎన్నికల నోటిఫికేషన్‌ అక్టోబర్‌ 19

ఎన్నికల నోటీసు అక్టోబర్‌ 21

నామినేషన్ల స్వీకరణ అక్టోబర్‌ 23

పరిశీలన అక్టోబర్‌ 24

అభ్యంతరాల స్వీకరణ అక్టోబర్‌ 25

అభ్యంతరాల పరిష్కారం అక్టోబర్‌ 26

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌

ఫేజ్‌–1

ఎన్నికల నోటిఫికేషన్‌ నవంబర్‌ 13

ఎన్నికల నోటీసు నవంబర్‌ 15

నామినేషన్ల స్వీకరణ నవంబర్‌ 17

పరిశీలన నవంబర్‌ 18

నామినేషన్ల అభ్యంతరాలు

స్వీకరణ నవంబర్‌ 19

అభ్యంతరాల పరిష్కారం నవంబర్‌ 20

నామినేషన్ల ఉపసంహరణ నవంబర్‌ 21

ఎన్నికలు నవంబర్‌ 26

ఫేజ్‌–2

ఎన్నికల నోటిఫికేషన్‌ నవంబర్‌ 16

ఎన్నికల నోటీసు నవంబర్‌ 18

నామినేషన్ల స్వీకరణ నవంబర్‌ 20

పరిశీలన నవంబర్‌ 21

నామినేషన్ల

అభ్యంతరాల స్వీకరణ నవంబర్‌ 22

అభ్యంతరాల పరిష్కారం నవంబర్‌ 23

నామినేషన్ల ఉపసంహరణ నవంబర్‌ 24

ఎన్నికలు నవంబర్‌ 29

ఫేజ్‌–3

ఎన్నికల నోటిఫికేషన్‌ : నవంబర్‌ 19

ఎన్నికల నోటీసు నవంబర్‌ 21

నామినేషన్ల స్వీకరణ నవంబర్‌ 23

పరిశీలన నవంబర్‌ 24

నామినేషన్ల

అభ్యంతరాల స్వీకరణ నవంబర్‌ 25

అభ్యంతరాల పరిష్కారం నవంబర్‌ 26

నామినేషన్ల ఉపసంహరణ నవంబర్‌ 27

ఎన్నికలు డిసెంబర్‌ 2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement