ఉద్దాన, తీర ప్రాంతాల్లో రక్త నమూనాల సేకరణ | - | Sakshi
Sakshi News home page

ఉద్దాన, తీర ప్రాంతాల్లో రక్త నమూనాల సేకరణ

Oct 15 2026 11:35 AM | Updated on Oct 15 2026 11:35 AM

పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం

IIలో

వజ్రపుకొత్తూరు : ఉద్దానం, తీర ప్రాంత గ్రామాల్లో ఐసీఎంఆర్‌ ఆమోదంతో విశాఖపట్నం కేజీహెచ్‌ ఆస్పత్రి నిపుణల బృందం రక్త నమూనాలు సేకరిస్తోంది. బుధవారం వజ్రపుకొత్తూరు మండలంలోని కొత్తపేట, కొమరల్తాడ, సైనూరు, యూఆర్‌కేపురం తదితర గ్రామాల్లో దాదాపు 120 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి వాటిని ల్యాబ్‌లో రీసెర్చ్‌ చేస్తున్నట్లు టెక్నికల్‌ సపోర్టు టీమ్‌ హెడ్‌ సాయికుమార్‌ తెలిపారు. ఇప్పటికే ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందసతో పాటు ఏడు మండలాల్లో 5వేలు పైచిలుకు రక్త నమూనాలు సేకరించి పరిశోధిస్తున్నట్లు చెప్పారు. కిడ్నీ వ్యాధి సంక్రమణ, ప్రజల ఆహారపు అలవాట్లను సైతం పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు ఉన్న వ్యాధిగ్రస్తుల వ్యాధి తీవ్రత తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రాజెక్టుకు డాక్టర్‌ టి.రవిరాజ్‌ మెంటార్‌గా, డాక్టర్‌ జి.ప్రసాద్‌ ప్రిన్సిపాల్‌ ఇన్వెస్ట్‌గేటర్‌గా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. సేకరణ కార్యక్రమం చివరి దశకు వచ్చిందని తెలిపారు.

కొత్తపేటలో రక్త నమూనాలు సేకరిస్తున్న బృందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement