పంచ్‌ అదిరింది | - | Sakshi
Sakshi News home page

పంచ్‌ అదిరింది

Oct 15 2026 11:35 AM | Updated on Oct 15 2026 11:35 AM

శ్రీకాకుళం న్యూకాలనీ: స్కూల్‌గేమ్స్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో బాక్సింగ్‌ క్రీడాంశంలో శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు పతకాల పంట పండించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు వేదికగా ఈనెల 12 నుంచి 14 వరకు 70వ ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్‌ అండర్‌–14, అండర్‌–17 బాలబాలికల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు మొత్తం 12 పతకాలతో మోత మోగించారు. వీటిలో రెండు బంగారు, ఐదు రజత, మరో ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాలు సాధించిన క్రీడాకారులను డీఈవో రవిబాబు, ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీలు చల్లా జగదీష్‌, జీఎం జ్యోతిరాణి, బాక్సింగ్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బలగ అనంతలక్ష్మణ్‌దేవ్‌ (అను), వంగా మహేష్‌, బాక్సింగ్‌ కోచ్‌లు ఉమామహేశ్వరరావు, రాజీవ్‌, అప్పలరాజు, ఒలింపిక్‌, పీడీ–పీఈటీ సంఘ ప్రతినిధులు, సీనియర్‌ క్రీడాకారులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement