మెళియాపుట్టి : మెళియాపుట్టి మండల కేంద్రంలో కోతుల బెడద కొనసాగుతోంది. బుధవారం రాజావీధి, భాగ్యనగర్ వీధి, ఎగువ వీధి, సవర వీధుల్లో కోతులు తిరుగుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశాయి. పలువురిని గాయపరిచాయి. ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించినా దాడులు చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతులను తరలించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నేడు నిద్దాంలో
ఉచిత గుండె పరీక్షల శిబిరం
జి.సిగడాం: నిద్దాం గ్రామంలో గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పేదల కోసం ఉచిత గుండె, ఊపరితిత్తుల వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్టు మాజీ వైస్ ఎంపీపీ మీసాల సాద్వీమణి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


