బేస్‌బాల్‌లో శ్రీకాకుళం ప్రభంజనం | - | Sakshi
Sakshi News home page

బేస్‌బాల్‌లో శ్రీకాకుళం ప్రభంజనం

Sep 16 2026 4:19 AM | Updated on Sep 16 2026 4:19 AM

శ్రీకాకుళం న్యూకాలనీ: బేస్‌బాల్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో శ్రీకాకుళం జిల్లా ప్రభంజనాన్ని సృష్టించింది. ఈ సీజన్‌లో ఇప్పటికే సాఫ్ట్‌బాల్‌, బాల్‌ బాడ్మింటన్‌, బాక్సింగ్‌, మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో సత్తాచాటిన శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు.. బేస్‌బాల్‌లోనూ అద్భుతమైన ఆటతీరుతో రాణించి విజయదుందుబీ మోగించారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి వేదికగా ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు జరిగిన 8వ ఏపీ రాష్ట్రస్థాయి సీనియర్స్‌ బేస్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌–2026 పోటీల్లో శ్రీకాకుళం జట్లు విజయవిహారం చేశాయి. మహిళల జట్టు విజేతగా నిలవగా, పురుషుల జట్టు రన్నరప్‌గా నిలిచింది. పలువురు క్రీడాకారులు జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా జట్లు అద్భుతమైన ప్రతిభతో విజేతలగా నిలవడంపై శ్రీకాకుళం జిల్లా బేస్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు తమ్మినేని సుజాత, ప్రధాన కార్యదర్శి గుంటముక్కల వీరభద్రరావు, కార్యనిర్వాహక కార్యదర్శి కొండపల్లి రవికుమార్‌, సంఘ ప్రతినిధులు హరి, కె.కిరణ్‌కుమార్‌, చల్లా జగదీశ్‌, సాదు శ్రీనివాసరావు, వై.పోలినాయుడు, అరుణ్‌కుమార్‌ గుప్తా, రామాంజనేయులు, రవి, సింహాద్రి నాయుడు, ఒలింపిక్‌ సంఘ జిల్లా కార్యదర్శి మెంటాడ సంబమూర్తి, డీఎస్‌డీవో ఎ.మహేష్‌బాబు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement