టెక్కలి రూరల్: స్థానిక జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆస్పత్రి ఆవరణలో బుధవారం నల్ల రిబ్బన్లు నోటికి కట్టుకుని నిరసన తెలిపారు. దీనిలో భాగంగా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగి కుటుంబానికి అర్థిక భద్రత కల్పించాలని కోరుతూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు, లాబ్ టెక్నీషియన్స్, ఫార్మాసిస్ట్‌లు పాల్గొన్నారు.
మద్యం విక్రయదారుడిపై కేసు నమోదు
వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని పెదబాడాం గ్రామానికి చెందిన మద్యం విక్రయదారుడు ఎస్‌పీ వెంకటరావుపై మద్యం కేసు నమోదు చేసినట్లు ఇన్‌చార్జి ఎస్‌ఐ అప్పలరెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి పోలీసులు చేసిన తనిఖీల్లో వెంకటరావు వద్ద అక్రమంగా నిల్వ ఉన్న 10 మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. దీంతో మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.


