శక్తి చాలడం లేదు | - | Sakshi
Sakshi News home page

శక్తి చాలడం లేదు

Jul 8 2026 1:26 AM | Updated on Jul 8 2026 1:26 AM

బస్సెక్కడానికి..

పల్లె వెలుగులు పెంచాలి

మారుమూల గ్రామాల్లో విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లాలంటే సరైన బస్సు సౌకర్యం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు, సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందించాం.

– కుమరాపు యమున, డీఆర్‌వలస, జి.సిగడాం

అదనపు బస్సులు నడపాలి

శ్రీకాకుళం డిపో నుంచి రాజాం వరకు ప్రత్యేక బస్సులు నడపాలి. సీ్త్ర శక్తి పథకం ద్వారా విద్యార్థులు సకాలంలో విద్యాలయాలను చేరలేకపోతున్నారు. తక్షణమే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలి.

– వాన ప్రమీల,

ఎందువ, జి.సిగడాం

సీటు దొరికితే ఒట్టు..

ఉచిత బస్సులను ప్రభుత్వం ప్రవేశ పెట్టి ఆడవాళ్లుకు ఉచితంగా ప్రయాణం చేసేందుకు వీలు కల్పించింది. అయితే బస్సులు సమయానికి లేకపోవడం దానికి తోడు బస్సులు సైతం తక్కువగా ఉండటంతో ఉన్న బస్సులలో ఎక్కువ మంది ప్రయాణిస్తుండడంతో కూర్చునేందుకు సైతం సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నాం.

–ఎన్‌ చిన్నమ్మి బూరగాం గ్రామం

జి.సిగడాం: పొగిరి జంక్షన్‌ వద్ద నిత్యం ఇదే పరిస్థితి

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ జి.సిగడాం :

కూర్చుందామంటే సీటు దొరకదు.. కుదురుగా నిలబడదామంటే ఆ రద్దీలో కుదరదు. అటు కూర్చోలేక.. నిటు నిలుచోలేక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు నరక ప్రాయంగా మారాయి. సీ్త్ర శక్తి పథకం అమలు జరిగాక బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. రద్దీ పెరిగాక బస్సుల సంఖ్యను పెంచాల్సిన ప్రభుత్వం మిన్నకుండిపోవడంతో రోజూ ప్రయాణాలు చేసే వారు ఒళ్లు హూనం చేసుకుంటున్నారు.

బస్సు ఆపడమే లేదు..

ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేయకముందు రూట్లలోని చిన్న పల్లెలు, పట్టణ శివార్లలోని చాలా చోట్ల ఆర్టీసీ బస్సులను ఆపేవారు. ప్రస్తుతం ప్రారంభ బస్టాండుల్లోనే ప్రయాణికులు నిండిపోవడంతో దారి మధ్యలో ఎక్కడా బస్సు చెయ్యెత్తినా ఆపడం లేదు. బస్టాండ్లలోనూ బస్సెక్కేటప్పుడు సిగపట్లు తప్పడం లేదు.

అన్నీ పాత బస్సులే..

జిల్లాలో రోజుకి లక్షా 40వేల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. సీ్త్ర శక్తి ద్వారా 70 వేల నుంచి 80 వేల మంది మహిళలు, టిక్కెట్‌ ద్వారా ప్రయాణిస్తున్న వారు 60వేల నుంచి 70వేల మంది వరకు ఉన్నారు. పాత బస్సులు నిరంతరం తిరగడం వల్ల సాంకేతిక సమస్యలు తలెత్తి షెడ్డుకు చేరుతున్నా యి. ఫలితంగా బస్సుల కొరత ఏర్పడుతోంది. ఓవర్‌ లోడ్‌ రద్దీ కారణంగా బస్సుల బాడీ, సస్పెన్షన్‌, ఇంజన్‌ కండిషన్‌ పూర్తిగా దెబ్బతింటోందని అద్దె బస్సుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వేధిస్తున్న సిబ్బంది కొరత

వందలాది మంది డ్రైవర్లు, కండక్టర్లు పదవీ విర మణ పొందుతున్నా ఆ ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ఉన్న సిబ్బందిపైనే పని భారం పెరుగుతోంది. రద్దీగా ఉండే బస్సుల్లో అందరికీ జీరో టిక్కెట్లు జారీ చేయడం, ఐడీ కార్డులు తనిఖీ చేయడం కండక్టర్లకు కష్టంగా మారుతోంది. ఇక ఈ పథకం పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ వంటి సర్వీసులకు మాత్రమే వర్తిస్తుంది. నాన్‌ స్టాప్‌, లగ్జరీ, డీలక్స్‌ బస్సులకు వర్తించదు. దీనిపై అవగాహన లేక చాలామంది మహిళలు ఈ బస్సులు ఎక్కి కండక్టర్లతో ఉచితం కోసం వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ సందడిలో దొంగలు కూడా హస్త లాఘవం చూపుతున్నారు.

శ్రీకాకుళం కాంప్లెక్స్‌లో అవస్థలు

బ్యాగు వేస్తేనే సీటు

బస్సెక్కాలంటే భయపడుతున్న ప్రయాణికులు

విపరీతంగా పెరిగిపోయిన రద్దీ

రద్దీ బస్సుల్లో దొంగతనాలు

బస్సుల సంఖ్య పెంచకపోవడంపై జనం మండిపాటు

విద్యార్థులకు ఇబ్బంది

మారుమూల పల్లెల్లో ఉన్న విద్యార్థులకు ప్రయాణం సదుపాయం లేదు. గతంలో జి.సిగడాం మండలానికి 5 బస్సులు నడిపేవారు. ప్రస్తుతం గెడ్డకంచరాం తప్ప ఏవీ అందు బాటులో లేవు. – కంది రమాదేవి,

ఎస్పీఆర్‌పురం, జి.సిగడాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement