ఎవరెవరు ఎటు వైపో..? | - | Sakshi
Sakshi News home page

ఎవరెవరు ఎటు వైపో..?

Jul 8 2026 1:26 AM | Updated on Jul 8 2026 1:26 AM

● జిల్లా పోలీసు సిబ్బందిపై విభజన ప్రభావం

● జిల్లాలో 20 హెడ్‌కానిస్టేబుళ్లు, 5 ఏఎస్‌ఐ స్థానాలు ఖాళీ

● ప్రమోషన్ల డేటా అంతా విజయవాడలోనే..

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లాల విభజన ప్రక్రియ ప్రభావం.. ఇప్పుడు కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్ల ప్ర మోషన్లపై ఉత్కంఠ రేపుతోంది. ఎవరికి ప్రమోషన్‌ లభిస్తుందో.. ఎవరు ఏ జిల్లాకు వెళ్లాల్సి వస్తుందో అంతా విజయవాడ మంగళగిరి కేంద్రంగా ఈనెల 12నే తేలనుంది. ఆప్షనల్‌ అయినా, మ్యూచువల్‌ అయినా గూగుల్‌ షీట్‌లోనే డేటా అంతా పొందుపర్చడంతో విజ్ఞప్తులైనా, వినతులైనా అక్కడే తేలాల్సి ఉండడంతో అంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. మంగళవారం జిల్లా పోలీసుకార్యాలయం నుంచి ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, అదనపు ఎస్పీ కేవీ రమణ (అడ్మిన్‌)లు జూమ్‌ కాన్ఫరెన్సు నిర్వహించి ఆయా స్టేషన్ల పరిధి సిబ్బంది సాధకబాధక వివరాలు క్షుణ్ణంగా తెలుసుకున్నారు. దీనిపై ఎక్కువ శాతం మంది మ్యూచువల్‌, రిక్వెస్టు ప్రాతిపదికన చేస్తే మేలు చేసేవారవుతారని వారి వారి అభిప్రాయాలు విన్నవించుకున్నారు.

జిల్లాలో దాదాపు 900 మంది సివిల్‌ కానిస్టేబుళ్లు, 200 మంది హెడ్‌కాస్టేబుళ్లు ఉన్నారు. ఏఆర్‌కు సంబంధించి మరో 200 మంది ఉన్నారు. వీరు ఏటా 10 శాతం మంది సివిల్‌ విభాగంలోకి ప్రమోషన్లపై వచ్చేస్తారు. అయితే బైఫరికేషన్‌ అయ్యాక మన శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం జిల్లా కు రాజాం అర్బన్‌, రాజాం రూరల్‌, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, వంగర వెళ్లిపోగా.. మన్యం–పార్వతీపురం జిల్లాకు దోనుబాయి, సీతంపేట, బత్తిలి, వీరఘట్టం, పాలకొండ స్టేషన్లు కేటాయించారు. అప్పట్లోనే బదిలీల సర్దుబాట్లు రేషియో ప్రకారం చేయడం, అక్కడి వారు ఇక్కడికి ఇక్కడ వాళ్లు అక్కడ చేరారు. ప్రస్తుతానికి జిల్లాలో హెడ్‌ కానిస్టేబుళ్ల ప్రమోషన్ల జాబితాలో 20 ఖాళీలుండగా, ఏఎస్‌ఐల ప్రమోషన్ల జాబితాలో 10 ఖాళీల్లో 5 ఖాళీలను ఇటీవలే భర్తీ చేశారు. మిగతా 5 ఖాళీలు ఉన్నాయి.

ఎవరికి మోదం.. ఎవరికి ఖేదం

ఈ నెల 5 తర్వాత ఎలాంటి ప్రమోషన్లు ఇవ్వకూడదని.. ఇచ్చేదున్నా 5వ తేదీ లోపేనని, తర్వాత ఫ్రీజింగ్‌ ఉల్లంఘనకు వస్తుందని చెప్పిన ప్రభుత్వం ఉద్యోగ సంఘాల విజ్ఞప్తితో ఈనెల 12 వరకు గడువిచ్చింది. దీంతో ఈలోగైనా 20 హెచ్‌సీ, 5 ఏఎస్‌ఐ ప్రమోషన్లు ఇస్తే బాగుంటుందని బాహాటంగానే అధికారులతో సిబ్బంది జూమ్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. సర్దుబాట్లలో భాగంగా కచ్చితంగా ప ది శాతం మంది మన జిల్లా నుంచి, పదిశాతం విజయనగరం జిల్లా నుంచి మన్యం జిల్లాకు రేషియో ప్రకారం బదిలీపై వెళ్లాల్సి ఉంటుంది. ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ ప్రకారం జూనియర్లు ఎక్కడికి పొమ్మంటే అక్కడికి వెళ్లాల్సి ఉండటంతో పాటు మొదట పనిచేసిన ప్లేసులోనూ జూనియర్‌గాను, తర్వాత చేరే ప్లేసులోనూ జూనియర్‌గానే కెరీర్‌ ముగిసినా ఆశ్చర్యపోనక్కర్లేదనే వాదనలూ వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement