నందిగాం: మండలంలోని బెజ్జిపల్లి రైతు సేవా కేంద్రంలో ఖరీఫ్ వరి పంటకు సంబంధించిన ఎరువులను మంగళవారం పంపిణీ చేశారు. మండల వ్యవసాయధికారి శ్రీకాంత్ వర్మ ఆధ్వర్యంలో లట్టిగాం, దిమిలాడ పీఏసీఎస్ అధ్యక్షులు పినకాన అజయ్‌కుమార్, పోలాకి చంద్రశేఖర్‌లు ఈ పంపిణీని ప్రారంభించారు. ఎరువులను కూడా ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయాధికారి తెలియజేశారు. గత ఏడాది యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడగా, ఈ ఏడాది యూప్ ద్వారా ఎరువుల పంపిణీతో మరిన్ని ఇబ్బందులు తప్పవని రైతులు వాపోతున్నారు. కణితూరులో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక నాయకుడు యూరియాను అక్రమంగా తన ఇంటిలో నిల్వ చేసుకొని గత మూడు రోజులుగా రహస్యంగా అమ్మకాలు చేపడుతున్నారు. బెజ్జిపల్లి, పెంటూరుకు చెందిన పలువురు రైతులకు యూరియా అక్రమంగా విక్రయించినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు అధికారికంగా రైతు సేవా కేంద్రంలో ఎరువుల పంపిణీ మంగళవారం ప్రారంభించగా, కణితూరు ఆసామి రహస్యంగా యూరియా అమ్ముతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.


