వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలో తీసుకున్న నిర్ణయం.. నేడు ఫలాలను అందిస్తోంది. టెక్కలి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 2021–22 సంవత్సరంలో ప్లస్–2 జూనియర్ కళాశాలను ప్రారంభించారు. ముందుగా బైపీసీ, ఎంపీసీ గ్రూప్‌లతో ప్రారంభమైన ఈ కళాశాల ఇప్పుడు దినదిన ప్రవర్ధమానమై ఎదిగింది. ద్వితీయ సంవత్సరంలో 80 సీట్లు పూర్తవ్వగా.. ప్రథమ సంవత్సరానికి సంబంధించి మరో 5 సీట్లు పెంచితే ఆ 85 సీట్లు కూడా పూర్తయ్యాయి. దీంతో కళాశాల ప్రిన్సిపాల్ శోభారాణి నో మోర్ అడ్మిషన్స్ అంటూ బోర్డు ఏర్పాటు చేశారు. – టెక్కలి రూరల్


