రేషన్ బియ్యం స్వాధీనం
రణస్థలం: లావేరు మండలంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని లావేరు ఎస్సై కె.అప్పలసూరి పట్టుకున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రేగపాలెం గ్రామం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా లగేజీ వ్యాన్‌ను అడ్డుకున్నారు. రణస్థలం మండలం సూరంపేట నుంచి వస్తున్న ఈ వాహనంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించి డ్రైవర్ గొరంటి గణేష్‌ను అదుపులోనికి తీసుకుని లావేరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రణస్థలం సివిల్ సప్లయ్ డీటీ వై.అరుణ పరిశీలించగా 45 బస్తాల్లో 22.50 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. 6ఏ కేసు నమోదు చేశారు. వాహనం సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై అప్పలసూరి చెప్పారు. ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామానికి చెందిన డ్రైవర్ గణేష్ ఈ బియ్యాన్ని శ్రీకాకుళం తరలిస్తున్నాడని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఉన్నతాధికారులకు తెలియజేస్తామని అధికారులు వెల్లడించారు.


