63 ఏళ్లలో ఆసక్తిగా..
ఈయన పేరు కె.ఎస్.ఎన్.మూర్తి. రిటైర్డ్ బ్యాంకు ఆఫీసర్. చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తి ఉండేది. బ్యాంకులో ఉద్యోగం వచ్చాక సంగీతం కలగానే మిగిలిపోయింది. రిటైరయ్యాక సమయం దొరకడంతో ఇలిసిపురంలోని వాణీ సంగీత విద్యాలయంలో దుంపల ఈశ్వరరావు వద్ద సంగీత సాధన ఆరంభించారు. ఇప్పటికే వర్ణాలు, కొన్ని అన్నమయ్య కీర్తనలు నేర్చుకున్నారు. 63ఏళ్ల వయసులో అవిశ్రాంతంగా సాధన చేస్తున్నారు.
కెఎస్‌ఎన్ మూర్తి, రిటైర్డ్ డిజిఎం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా


