వేడుకగా కళింగ ఆత్మీయ సమ్మేళనం
ఎచ్చెర్ల/శ్రీకాకుళం న్యూకాలనీ: ఎచ్చెర్ల మండల కేంద్రంలోని చౌదరి సత్యనారాయణ తోటలో ఆదివారం రాష్ట్రస్థాయి కళింగ సామాజిక వర్గ ఆత్మీయ కలయిక సమావేశం ఘనంగా జరిగింది. జిల్లా నలుమూలలతోపాటు విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, ఏలూరు, రాయలసీమ, బరంపురం, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. కళింగ సామాజికవర్గ పెద్దల సూచనలతో కళింగ సంక్షేమ సంఘ ప్రతినిధులు చింతాడ రామ్మోహనరావు, దుప్పల వెంకటరావు, దుంపల రామారావు, దానేటి శ్రీధర్, పూజారి చెల్లయ్య, పూడి తిరుపతిరావు, మొదలవలస లీలామోహన్, బీవీఎస్‌ఎన్‌రాజు తదితరులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడంతో సుమారు 50వేల మంది హాజరయ్యారు. కళింగ సామాజిక వర్గం సంక్షేమం, అభివృద్ధి కోసం ఐక్యంగా ముందుకు సాగాలని వక్తలు పిలుపునిచ్చారు. ప్రముఖ సినీ గాయకుడు ధనుంజయ్ తన పాటలతో ఉత్సాహపరిచారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పిరియా విజయ జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు. మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజు, వైఎస్సార్ సీపీ కాళింగ సామాజిక వర్గం వైఎస్సార్ సీపీ మాజీ అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు, తదితరులు హాజరై ఆమె చేత కేక్ కటింగ్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఏపీ పరిపాలన ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ గురుగుబెల్లి యతిరాజులు, కృష్ణా విశ్వవిద్యాలయం వీసీ కూన రామ్‌జీ, ఎమ్మెల్యే కూన రవికుమార్, కళింగ కార్పొరేషన్ రాష్ట్ర ౖచైర్మన్ రోణంకి కృష్ణంనాయుడు, మాజీ చైర్మన్‌లు పేరాడ తిలక్, దుంపల రామారావు, పేడాడ రమణకుమారి, వైఎస్సార్ సీపీ నేతలు కిల్లి సత్యనారాయణ, చింతాడ రవికుమార్, తమ్మినేని చిరంజీవినాగ్, సింగుపురం మోహనరావు, ఎన్ని ధనుంజయరావు, తదితరులు పాల్గొన్నారు.
వేడుకగా కళింగ ఆత్మీయ సమ్మేళనం


