ఐక్యతతోనే యాదవుల అభివృద్ధి సాధ్యం
గార: జిల్లాలోని యాదవులంతా ఐక్యతగా ఉన్నప్పుడే రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధ్యమవుతుందని యాదవ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నర్తు నరేంద్రయాదవ్ అన్నారు. ఆదివారం అంపోలు జిల్లా జైలు సమీపంలోని వెలమ సంక్షేమ సంఘ కార్యాలయం ఆవరణలో జిల్లా యాదవుల వనభోజన కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ బీసీ–డీలో ఉన్న యాదవులను బీసీ–ఏ లేదా బీలో చేర్చేలా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. యాదవ సంక్షేమ సంఘానికి మూడు ఎకరాల స్థలాన్ని మంజూరు చేసేలా ప్రయత్నం చేద్దామన్నారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా తప్పెటగుళ్ల ప్రదర్శన, జిల్లాస్థాయి సంగిడీ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో గద్దిబోయిన కృష్ణారావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పాలిన శ్రీనివాసరావు, ఇచ్ఛాపురం మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ ఉలాల భారతి దివ్య, ఎంపీపీలు డొక్కరి దానయ్య, ఉంగ సాయి, కుజ్జ తాతయ్య, సబ్బి జానకీరామ్, డాక్టర్ నర్తు శేషగిరి, కలగ జగదీష్, జన్నెల రవికుమార్, గొర్లె రమణమూర్తి, ఇప్పిలి జగదీష్, కొరాయి వాసు తదితరులు పాల్గొన్నారు.


