డీటీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ
శ్రీకాకుళం: డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్–2026 క్యాలెండర్లు, డైరీలను ఫెడరేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కోత ధర్మారావు, జిల్లా అధ్యక్షుడు పూజారి హరిప్రసన్న ఆవిష్కరించారు. శ్రీకాకుళం రైతు బజార్ కూడలిలోని విశ్రాంత ఉద్యోగుల భవనం ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హరిప్రసన్న మాట్లాడుతూ వృత్తి నిబద్ధత, సామాజిక బాధ్యతతో డీటీఎఫ్ పనిచేస్తుందన్నారు. ఉమ్మడి పోరాటాలకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని తెలిపారు. వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేసి తక్షణమే మధ్యంతర భృతి ప్రకటన చేయాలని, ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో శ్రీకాకుళం, ఐటీడీఏ సంఘ ఇన్‌చార్జిలు రమణమూర్తి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఔషధ నిల్వ కేంద్రం తనిఖీ
గార: గార పీహెచ్‌సీలోని ఔషధ నిల్వ కేంద్రాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి అనిత ఆదివారం తనిఖీ చేశారు. ముందుగా రోగుల ఓపీ రిజిస్టర్, మందుల నిల్వలను పరిశీలించారు. వైద్యాధికారులు 24 గంటలూ అందుబాటులో ఉండాలని, అత్యవసర మందులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ రమ్య, డాక్టర్ సోనియా, ఫార్మాసిస్టు సత్యభామ పాల్గొన్నారు.
డీటీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ


