అ‘విశ్రాంత’ సాధన
సంగీతంలో..
● సంగీత కళపై పెద్దల ఆసక్తి ● వేదికలపై ప్రదర్శనలు ఇస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు, వైద్యులు
శ్రీకాకుళం కల్చరల్ : సంగీత సాధనకు వయసు అడ్డంకి కాదని వారంతా నిరూపిస్తున్నారు. వివిధ వృతుల్లో దశాబ్దాల అనుభవం సాధించి విశ్రాంత జీవనం గడుపుతున్న వారు.. గృహిణులు.. వైద్యులు.. ఇలా ఎంతోమంది సీనియర్లు ఇప్పుడు జూనియర్లుగా మారి సంగీత సాధనలో నిమగ్నమవుతున్నారు. గురువులు వద్ద మెలకువలు సాధించి వేదికలపై ప్రదర్శనలకు సైతం సిద్ధమవుతున్నారు. జిల్లా కేంద్రంలో సంగీత కళలో శిక్షణ పొందుతున్న వీరి జీవన ప్రయాణం ఆసక్తికరం.


