బస్సులు పెంచకుంటే సీ్త్ర శక్తి కష్టమే
శ్రీకాకుళం అర్బన్: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీ్త్ర–శక్తి పథకం అమలులో ఉద్యోగులపై కేసులు పెట్టి సస్పెండ్ చేస్తున్న విధానాలను ఆర్టీసీ అధికారులు మానుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాల బాట పట్టక తప్పదని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూని యన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు హెచ్చరించారు. శ్రీకాకుళంలోని ఆర్టీసీ ఈయూ కార్యాలయంలో శనివారం ఈయూ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీ్త్ర–శక్తి పథకం అమలుతో ఉద్యోగులపై పెరిగిన పని భారం తగ్గించాలంటే ప్రస్తుతం కనీసం 3,000 అదనపు బస్సులు పెంచాలన్నారు. అన్ని కేటగిరీల్లో ఉన్న ఖాళీల్లో కనీసం 10,000 పోస్టుల భర్తీ చేయాలని కోరారు. కొత్త బస్సులు, కొత్త నియామకాలు లేకుండా ఇదే సిబ్బందితో, ఇవే బస్సులతో సీ్త్ర–శక్తి పథకాన్ని విజయవంతం చేయడం ఎన్నాళ్లూ సాధ్యం కాదన్నారు.


