విద్యార్థినిపై స్కూల్ పీడీ భర్త దాడి..?
జనవరి 11న ఏపీ ఎన్‌జీఓ జిల్లా కార్యవర్గ ఎన్నికలు
శ్రీకాకుళం అర్బన్: ఏపీఎన్జీజీ అసోసియేషన్ శ్రీకాకుళం జిల్లా కార్యవర్గానికి సంబంధించి జనవరి 11న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు సంబంధించి ప్రణాళికను, సంబంధిత వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఎ.విద్యా సాగర్, ప్రధాన కార్యదర్శి డీవీ రమణ విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏపీఎన్జీజీఓ జిల్లా అధ్యక్షులు హనుమంతు సాయిరాం, కార్యదర్శి చల్లా శ్రీనివాస్‌లు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. దీని ప్రకా రం.. ముందుగా నిర్ణయించిన ప్రణాళికలో భాగంగా ఈ నెల 30న నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈ నెల 31న నామినేషన్ల విత్ డ్రా, ఈ నెల 11న ఎన్నికలకు సంబంధించి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యా హ్నం మూడు గంటల వరకూ కార్యాచరణ ఉంటుంది. ఈ ఎన్నికల ప్రక్రియ అంతా ఏపీ ఎన్జీజీవో కార్యాలయం (శ్రీకాకుళం నగరం) కేంద్రంగానే సాగనున్నాయి. ఎన్నికల అధికారిగా ఆర్.రవి శంకర్ (జిల్లా కార్యదర్శి, ఏపీఎన్జీజీఓ అసోసియేషన్, విశాఖపట్నం జిల్లా శాఖ), సహాయ ఎన్నికల అధికారిగా వై.ఎన్. ప్రసాద్ (జాయింట్ సెక్రటరీ, ఏపీఎన్జీజీఓ అసోసియేషన్, విశాఖపట్నం జిల్లా శాఖ) వ్యవహరించనున్నారు. జిల్లా కార్యవర్గంలో నలుగురు ఈసీలు, పట్టణ కార్యవర్గంలో 13 మంది ఈసీ ల నియామకం పూర్తయ్యింది. ఇప్పుడు ఒక అధ్యక్ష, ఒక సహాధ్యక్ష, 6 ఉపాధ్యక్ష స్థానాలతో పాటే ఒక కార్యదర్శి, ఒక కార్యనిర్వాహక కార్యదర్శి, 6 సంయుక్త కార్యదర్శి స్థానాలతో పాటు ఒక కోశాధికారికి సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. తాలుకాలకు సంబంధించిన కార్యవర్గాల్లో యువతకూ, మహిళలకూ, అలా గే సీనియర్లకూ సముచిత రీతిలో సమాన నిష్పత్తిలో అవకాశం కల్పించామని, ప్రతి కార్యవర్గంలోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేశామని ఏపీ ఎన్జీజీఓ జిల్లా అధ్యక్షులు హనుమంతు సాయిరాం స్పష్టం చేశారు.
మెళియాపుట్టి: మండలంలోని బందపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో మరో వీడియో వైరల్ అవుతోంది. పాఠశాలకు చెందిన విద్యార్థినిపై అక్కడ పనిచేస్తున్న ఫిజికల్ డైరెక్టర్ భర్త దాడి చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది జనవరి 26న ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఇదే పాఠశాలలో ఓ టీచర్ విద్యార్థులతో కాళ్లు పట్టించుకున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో వీడియో రావడం కలకలం రేపుతోంది. ఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశాంతికుమారికి ఎలాంటి సమాచారం లేదు. రాష్ట్ర గిరిజన సంక్షేమ పరిషత్ అధ్యక్షులు వాబ యోగి కూడా స్పందిస్తూ ఈ వీడియో నిజమైతే ఐటీడీఏ పీఓ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. మండల సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు గణేష్, కార్యదర్శి సవర వెంకటేష్, గిరిజన సంఘం నేతలు గురువారం ఆశ్రమ పాఠశాల వద్దకు చేరుకుని ప్రైవేటు వ్యక్తులు పాఠశాలలోకి ఎలా వస్తున్నారో విచారణ జరపాల్గొన్నారు.
కమ్మేస్తున్న పొగ మంచు
హిరమండలం: మేజర్ పంచాయతీ హిరమండలాన్ని పొగ మంచు కమ్మేస్తోంది. ఉదయం 8 గంటల వరకూ పొగమంచు కమ్ముకోవడంతో వాహదారులు ఇబ్బందులు పడ్డారు. వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తోంది. హిరమండలం కొత్తూరు మధ్య అలికాం–బత్తిలి ప్రధాన రహదారి పొగమంచు కమ్ముకుంది.
1/2
విద్యార్థినిపై స్కూల్ పీడీ భర్త దాడి..?
2/2
విద్యార్థినిపై స్కూల్ పీడీ భర్త దాడి..?