నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
ఎచ్చెర్ల : ఎచ్చెర్లలోని శ్రీవేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కోసం ఉచితంగా ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు కళాశాల ప్రతినిధులు గురువారం తెలిపారు. డ్రోన్ సర్వే టెక్నీషియన్ కోర్సులో 105 సీట్లు అందుబాటులో ఉన్నాయని, మూడు నుంచి నాలుగు నెలల పాటు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయస్సు కలిగి టెన్త్, ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన వారు అర్హులని తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆరు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, విద్యార్హత పత్రం, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, కుల ఆదాయ నివాస తదితర ధ్రువీకరణ పత్రాలతో కళాశాలలో సంప్రదించాలని కోరారు. ఎస్సీ ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ అభ్యర్థులే అర్హులని, వివరాలకు 8247656581, 9533170822 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అర్హత గల ఉద్యో గార్థులు వినియోగించుకోవాలని వారు కోరారు.


