పార్టీలో పక్షపాత ధోరణి భరించలేక..
● టీడీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రాజీనామా
నరసన్నపేట: తెలుగు దేశం పార్టీ అను బంధ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ నాయకులు, నరసన్నపేట మండలం ఉర్లాం మాజీ సర్పంచ్ జల్లు చంద్రమౌళి పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయనే స్వయంగా ఫోన్ చేసి ప్రకటించా రు. స్థానిక నాయకత్వం పక్షపాత ధోరణి, తనపై చూపుతున్న వివక్షకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారని ఎప్పటి నుంచో టీడీపీలో ఉంటూ ఆ పార్టీనే నమ్ముకొని ఉన్న తనలాంటి సీనియర్లను పక్కన పెట్టడం అవమానంగా భావిస్తున్నానని తెలిపారు. చంద్రమౌళి టీడీపీలో నరసన్నపేట మండలంలో ప్రధాన నాయకులుగా చెలామణీ అయ్యారు. ఉర్లాం సర్పంచ్‌గా, ఎంపీటీసీగా, జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులుగా పనిచేశారు.
జల్లు చంద్రమౌళి


