రెండు షాపుల్లో దొంగతనాలు
నరసన్నపేట: మేజర్ పంచాయతీ పరిధి పోలాకి కూడలిలో ఉన్న రెండు షాపుల్లో మంగళవారం రాత్రి దొంగతనాలు జరిగాయి. గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు తీసి లోపలికి వెళ్లి నగదును అపహరించుకుపోయారు. రెండు చోరీల్లో రూ.15 వేల నగదు చోరీకి గురైనట్లు బాధితులు బరాటం శ్రీరామమూర్తి, వి.రాజులు తెలిపారు. ఉదయం ఎప్పటిలాగే కిరాణా షాపు తెరుద్దామని వచ్చేసరికి షట్టర్ తాళాలు తీసి ఉన్నాయని, లోపలికి వెళ్లి చూస్తే రూ.10లు, రూ.5ల కాయిన్స్ మూట కనిపించలేదని పేర్కొన్నారు. దీంట్లో సుమారుగా రూ.14 వేలు ఉన్నాయని తెలిపారు. అలాగే వి.రాజు పాన్‌షాపు తాళం తొలగించి బాక్స్‌లో ఉన్న రూ.1,100లు తీసుకుపోయారని తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని పోలీసులు వచ్చి పరిశీలించారని వివరించారు. కాగా ఇటువంటి దొంగతనాలు ఎప్పటికప్పుడు జరుగుతున్నాయని పోలీసులు పహరా పెంచాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు.


