ఇదేం పంచాయితీ !
పోలాకి: పంచాయతీలను అశాసీ్త్రయంగా విభజించేందుకు, దాని ద్వారా రానున్న స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అధికార పక్ష నాయకులు కుట్ర లు పన్నుతున్నారని కొందరు సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. పోలాకి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తున్నట్లు ఎంపీపీ ముద్దాడ దమయంతి భైరాగినాయుడు అధికారుల సమక్షంలోనే ప్రకటించారు. మిగిలిన మూడు మండలాల్లో సైతం మెజార్టీ గ్రామ పంచాయతీల తీర్మానాలు ఈ అశాసీ్త్రయ విభజనలను వ్యతిరేకిస్తూ జరిగాయి.
మండలాల వారీగా ప్రతిపాదనలు..
● పోలాకి మండలం బొద్దాం పంచాయతీలోని వనవిష్ణుపురం గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా, పిన్నింటిపేట వ్యాపార కేంద్రాన్ని పూర్వ పు కోడూరు పంచాయతీలో విలీనం చేసేలా, బెలమర పంచాయతీలోని జొన్నయ్యపేటను, మగతపాడు పంచాయతీలోని ప్రకాశరావుపేట ను బొద్దాం పంచాయతీలోనూ, బెలమర పంచాయతీలోని కిల్లిబుచ్చెన్నపేటను మగతపాడు పంచాయతీలోనూ విలీనం చేసేందుకు ప్రతిపాదనలు చేసినప్పటికీ ప్రస్తుతానికి వనవిష్ణుపు రం ప్రత్యేక పంచాయతీగానూ, పిన్నింటిపేటను కోడూరులోనూ విలీనం చేసేందుకు మాత్రమే గ్రామసభలు నిర్వహించినట్లు ఈఓ పీఆర్డీ పద్మావతి తెలిపారు.
● నరసన్నపేట మండలంలోని జమ్ము పంచాయతీలోని జమ్ము ప్రత్యేక పంచాయతీగాను, అదే పంచాయతీ అనుబంధ గ్రామమైన రావాడపేటను శివరాంపురం, పొన్నాడపేట, గడ్డెయ్యపేటలను కలుపుకుని ప్రత్యేక పంచాయతీగా నూ, మడపాం, బుచ్చిపేటలను వేర్వేరుగా ప్ర త్యేక పంచాయతీలుగా చేసి బుచ్చిపేటలో వీఎన్‌పురం పంచాయతీ చేనులవలసను విలీనం చేసేందుకుగాను ప్రతిపాదనలు చేశారు.
● జలుమూరు మండలంలోని అంధవరం పంచాయతీ నుండి, జోగులపేట, గంగన్నపేటలను విడదీసి అల్లాడ పంచాయతీ రామదాసుపేటతో కలపి రామదాసుపేటను ప్రత్యేక పంచాయతీగా ప్రతిపాదనలు చేసినప్పటికీ, జోగు లపేట, గంగన్నపేటల ప్రజలు మాత్రం మాకివలస పంచాయతీలో తమను విలీనం చేయా లని లేకపోతే అంధవరంలోనే కొనసాగించా లని కోరుతున్నారు. లింగాలవలస పంచాయ తీ నుంచి హరిక్రిష్ణంపేటను దరివాడ పంచాయతీలో విలీనంకు ప్రతిపాదించారు. తలతరియా పంచాయతీ నుంచి యర్రన్నపేట, సంతలబైలు గ్రామాలను విడదీసి యర్రన్నపేట ప్రత్యేక పంచాయతీగాను, జలుమూరు మండలకేంద్రం విడదీసిన నామాలపేట, కిల్లివాని పేట, కోనసింహోద్రిపేటను కలిపి నామాలపేటను ప్రత్యేక పంచాయతీగా చేసేందుకు ప్రతిపాదనలు చేశారు.
● సారవకోట మండలం అలుదు గ్రామ పంచాయతీ నుంచి వడ్డినవలస, మాకివలసలను వేరుచేసి వడ్డినవలసను ప్రత్యేక పంచాయతీగాను, కుమ్మరిగుంట పంచాయతీ నుంచి వేరుచేసిన సింగంవలస, సోమయ్యపేట, బొంగడిపేటలతో కలపి చోడసముద్రంను ప్రత్యేక పంచాయతీగాను, వాండ్రాయి పంచాయతీనుంచి విడదీసిన బెజ్జి, సవరబెజ్జిలు కలపి కొత్త పంచాయతీగాను, గొర్రిబంద పంచాయతీలోని జగ్గయ్యపేట, కోనవానిపేట, ఆగుతుపురంకలపి గొర్రిబంద పంచాయతీ కొనసాగించేందుకు అదే పంచాయతీలోని బురుజువాడ కేంద్రంగా రైవాడ, జగన్నాథపురం, సవరపేటలతో కూడిన కొత్తపంచాయతీ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు.
అశాసీ్త్రయంగా పంచాయతీ విభజన ప్రతిపాదనలు
తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సర్పంచ్‌లు, ప్రజలు
రాజకీయ ఒత్తిడితో గ్రామసభలు
నిర్వహించిన అధికారులు
వ్యతిరేకంగా తీర్మానాలు చేసిన పంచాయతీలు


