భక్తిశ్రద్ధలతో క్రిస్మస్‌ జరుపుకోవాలి | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో క్రిస్మస్‌ జరుపుకోవాలి

Dec 25 2025 10:10 AM | Updated on Dec 25 2025 10:10 AM

భక్తి

భక్తిశ్రద్ధలతో క్రిస్మస్‌ జరుపుకోవాలి

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని క్రైస్తవులకు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఈ మేరకు వారు వేర్వేరు ప్రకటన లు విడుదల చేశారు. క్రీస్తు బోధనలు సమాజంలో ప్రేమ, కరుణ, శాంతిని పెంపొందిస్తాయని కలెక్టర్‌ పేర్కొన్నారు. దేవుని కృప అందరిపై ఉండాలని, ఈ శుభదినం కుటుంబాల్లో ఐక్యతను, ఆనందాన్ని నింపాలని ఎస్పీ ఆకాంక్షించారు. పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన వివరించారు.

‘వినియోగదారులు హక్కులు తెలుసుకోవాలి’

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: వినియోగదారులు హక్కులు తెలుసుకుంటేనే నాణ్యమైన సేవలు అందుతాయని జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌ చైర్మన్‌ ఆర్‌.చిరంజీవి అన్నా రు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల సిల్వర్‌ జూబ్లీ ఆడిటోరియంలో బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. చదువుకునే సమయంలోనే ప్రాథమిక చట్టాలు తెలుసుకోవాలని చిరంజీవి సూచించారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా డిజిటల్‌ న్యాయ పాలన ద్వారా సమర్థ, సత్వర పరిష్కారం జరుగుతుందని జిల్లా సివిల్‌ సప్లై అధికారి జి.సూర్య ప్రకాష్‌ తెలిపారు. తూనిక లు కొలతలకు సంబంధించి మోసాలను గమనించి వినియోగదారులు ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని అసిస్టెంట్‌ కంట్రోలర్‌, లీగల్‌ మెట్రాలజీ పి.చిన్నమ్మ తెలిపారు. చిరుతిళ్లకు దూరంగా ఉండాలని అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ లక్ష్మీనారాయణ తెలిపారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మెమొంటో, నగదు బహుమతులను అందజేశారు.

రాష్ట్రస్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో మెరిసిన సిక్కోలు విద్యార్థులు

శ్రీకాకుళం : విజయవాడలో జరుగుతున్న రాష్ట్రస్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్‌ ప్రాజెక్టులు విశేషంగా ఆకట్టుకున్నాయి. వ్యక్తిగత విభాగంలో సోంపేట ఏపీ మోడల్‌ స్కూల్‌ విద్యార్థి కృష్ణవర్ధన్‌ ప్రదర్శించిన స్మార్ట్‌ స్కానర్‌, పోలవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎన్‌.కౌశిక్‌ ఆచారి ప్రదర్శించిన రియల్‌ టైం సదరన్‌ ఇండియా సైన్స్‌ ఫెయిర్‌ ఎంపికయ్యాయి. విద్యార్థులు వారి ఉపాధ్యాయులు చిన్నాజీవర్మ, ఎ.వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వీటిని రూ పొందించారు. ఉపాధ్యాయ విభాగంలో అదపాక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఫిజికల్‌ సైన్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ కె.కిరణ్‌కుమార్‌కు సంబంధించిన ప్రాజెక్టు కూడా ఎంపికై ంది. వీరు వచ్చే ఏడాది జనవరి 19 నుంచి హైదరాబాద్‌లో జరగబోవు సదరన్‌ ఇండియా సైన్స్‌ ఫెయిర్‌కు హాజరవుతారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు, ఉప విద్యాశాఖాధికారు లు విజయకుమారి, విలియమ్‌లు ఎంపికై నవారిని అభినందించారు.

ఘనంగా దివ్యాంగ విద్యార్థులకు క్రీడా పోటీలు

శ్రీకాకుళం న్యూకాలనీ: దివ్యాంగ (విభిన్న ప్రతిభావంతులు) విద్యార్థుల క్రీడా పోటీలు ముగిశాయి. పాఠశాల విద్య, సమగ్రశిక్ష ఆధ్వర్యంలో బుధవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా జోనల్‌స్థాయి అడ్వైంచర్‌ స్పోర్ట్స్‌ మీట్‌ జరిగింది. శ్రీకాకుళంతోపాటు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలోని దివ్యాంగ విద్యార్థులకు పలు క్రీడా పోటీలను నిర్వహించారు. 100, 400, 800 మీటర్ల పరుగు పందాలు, షాట్‌పుట్‌, లాంగ్‌జంప్‌ ఈవెంట్స్‌లో పోటీలను జరిపారు. జోనల్‌స్థాయి అడ్వెంచర్‌ క్రీడా పోటీలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ జోనల్‌మీట్‌ స్టేట్‌ పరిశీలకులు వై.నరసింహం మా ట్లాడుతూ ఇక్కడ జరిగే జోనల్‌ స్థాయిలో ఎంపికైన పదిమంది విద్యార్థులకు గండికోటలో నెలరోజుల పాటు శిక్షణను అందించిన తర్వాత పర్వతారోహణకు సిద్ధం చేస్తామని పేర్కొన్నారు.

అదపాక జెడ్పీ హెచ్‌స్కూల్‌ టీచర్‌

కె.కిరణ్‌కుమార్‌

సోంపేట ఏపీ మోడల్‌ స్కూల్‌ విద్యార్థి కృష్ణవర్ధన్‌

పోలవరం జడ్పీ

హెచ్‌ఎస్‌ విద్యార్థి కౌశిక్‌ ఆచారి

భక్తిశ్రద్ధలతో క్రిస్మస్‌ జరుపుకోవాలి 1
1/3

భక్తిశ్రద్ధలతో క్రిస్మస్‌ జరుపుకోవాలి

భక్తిశ్రద్ధలతో క్రిస్మస్‌ జరుపుకోవాలి 2
2/3

భక్తిశ్రద్ధలతో క్రిస్మస్‌ జరుపుకోవాలి

భక్తిశ్రద్ధలతో క్రిస్మస్‌ జరుపుకోవాలి 3
3/3

భక్తిశ్రద్ధలతో క్రిస్మస్‌ జరుపుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement