అప్పనంగా అప్పగిస్తారా..?
● ఓ ప్రైవేటు బడికి ప్రభుత్వ భూమిని అప్పగించే ప్రయత్నం
● తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జేఆర్‌పురం వాసులు
ప్రైవేటు స్కూల్ వద్ద నిరసన తెలుపుతున్న జేఆర్ పురం ప్రజా ప్రతినిధులు, స్థానికులు
కాజేసే కుట్ర
1987లో డీ–పట్టా రూపంలో ఈ భూమి సంక్రమించింది. స్కూల్ యాజమాన్యానికి 2004లో అద్దెకు ఇచ్చాం. కొన్నేళ్లు అద్దె ఇచ్చి ఆ తర్వాత ఇవ్వడం మానేశారు. అద్దె పత్రాలు, ఆస్తి పత్రాలు మా వద్దనే ఉన్నాయి. ఇందులో కొంత ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని కాజేసే కుట్ర జరుగుతోంది. – చిన సూర్యప్రకాశరావు, ప్రైవేటు స్కూల్ అసలు యజమాని, విజయనగరం
రణస్థలం: ప్రభుత్వ స్థలాన్ని అప్పనంగా ఓ ప్రైవేటు బడికి అప్పగించిన వైనంపై జేఆర్‌పురం వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బడి యాజమాన్య ప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వారి ఒత్తిళ్లకు రెవెన్యూ అధికారులు తలొగ్గి విలువైన 27 సెంట్లు భూమిని ధారాదత్తం చేయడానికి పూనుకున్నారు. స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలకు కూడా తెలియకుండా రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఈ తంతు నడిపిన విషయం ఆలస్యంగా వెలుగు చూడడంతో బుధవారం జేఆర్‌పురం వాసులు, ప్రజా ప్రతినిధులు బుధవారం స్కూల్‌వద్దకు వచ్చి నిరసన తెలిపారు. జేఆర్ పురం గ్రామంలో సర్వే నంబర్ 66లో 27,31,32లలో 27 సెంట్లు ప్రభుత్వ భూమి (గయాలు) ఉంది. ఆ భూమిని ఓ ప్రైవేటు స్కూల్‌కు రాకపో కలు సాగించేందుకు వీలుగా కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు శరవేగంగా స్పందించి ఏ–1 నోటీసు పరంగా దండోరా మూలంగా ప్రకటించి, గ్రామ సచివాలయంలో, సంబంధిత భూముల మీద ప్రచురించినట్లు ధ్రువీకరించారు. ఈ నోటీసులపై కొందరు కూటమి నాయకులు కూడా ఆ భూములు బదలాయింపునకు అనుకూలంగా సంతకాలు పెట్టడం గమనార్హం. మండల కేంద్రంలో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వాటర్ ట్యాంక్ నిర్మించేందుకు కూడా స్థలం కరువైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా చేయడం కలవరపరుస్తోంది.
అప్పనంగా అప్పగిస్తారా..?
అప్పనంగా అప్పగిస్తారా..?


