ఆస్పత్రి సిబ్బంది అవినీతి సదరంగం
నరసన్నపేట: స్థానిక ఏరియా ఆస్పత్రిలో అక్రమంగా సదరం సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే గతంలో పలువురు అనర్హులకు సర్టిఫికెట్లు ఇచ్చిన కథ కంచికి చేరలేదు. తాజాగా మళ్లీ సదరం సర్టికెట్ల మంజూరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆస్పత్రి సిబ్బంది దివ్యాంగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అమాయక ది వ్యాంగులు డబ్బులిచ్చి మోసపోతున్నారు. వైద్యు ని పరిశీలనలో వైకల్య శాతం 40 కి పైబడి డాక్టర్ ఇస్తున్నట్లు గమనించి ఆ అభ్యర్థులకు ఫోన్లు చేసి మీకు శాతం పెంచుతాం, ఇంత ఖర్చు అవుతుందని మాట్లాడి డబ్బులు గుంజుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో డిప్యుటేషన్‌పై వచ్చిన డిజిటల్ అసిస్టెంట్, ఆస్పత్రిలో ఉన్న కాంట్రాక్టు సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే డాక్టర్ పరిశీలనకు వెళ్లకుండానే ముగ్గురు వ్యక్తులకు సర్టిఫికెట్లు రికమెండ్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే మరో వ్యక్తికి టెక్కలి ఆస్పత్రికి పరిశీలనకు నోటీసు రాగా నరసన్నపేటలో అది కూడా ఆయన రాకుండానే సర్టిఫికెట్ రికమెండ్ చేసినట్లు తెలుస్తోంది.
దర్యాప్తులో బయటపడిన వాస్తవాలు
బుధవారం ఎంకై ్వరీకి డాక్టర్ సూర్యారావు రావడంతో వాస్తవాలు బయట పడ్డాయి. గత నెల 10 వ తేదీన వైద్యుడు 8 మందికి సర్టిఫికెట్లు మంజూరు చేశారు. అయితే 12 మందికి ఆ రోజు మంజూరైనట్లు రికార్డులను బట్టి తెలుస్తోంది. దీన్ని గమనించిన ఆర్థో డాక్టర్ రమణరావు శ్రీకాకుళం డీసీహెచ్‌సీకి రాతపూర్వంగా ఫిర్యాదు చేశారు. తాను 8 మందికే సర్టిఫికెట్లు మంజూరు చేయగా మొత్తం 12 మందికి ఇచ్చినట్లు ఉందని దీనిపై పరిశీలన చేయమని కోరారు. దీంతో టెక్కలి వైద్యులు సూర్యారావును ఎంక్వైరీకి వేశారు. బుధవారం నరసన్నపేట వచ్చిన సూర్యారావు డాక్టర్ రమణరావుతో పాటు ఆ నలుగు రు వ్యక్తులను విచారించి వారి నుంచి వివరాలు తీసుకున్నారు. తాము డాక్టర్ పరిశీలనకు వెళ్లలేదని వారు అంగీకరించారని తెలిపారు. ఆ రోజు ఆస్పత్రిలో ఉన్న సీసీ పుటేజీలు కూడా సేక రించారు. ఇందులో సిబ్బంది దివ్యాంగులతో మాట్లాడుతున్నట్లు స్పష్టంగా రికా ర్డయ్యిందని తెలిపారు. ఆస్పత్రికి రాకుండానే ఒకరికి, ఆస్పత్రికి వచ్చి వైద్యుడు పరిశీలించకుండానే మరో ముగ్గురికి సర్టిఫికెట్లకు రికమెండ్ చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు నివేదిక పంపుతున్నట్లు డాక్టర్ సూర్యారావు తెలిపారు.
నరసన్నపేట కేంద్రంగా సదరం సర్టిఫికెట్ల రాకెట్
ఆర్థో వైద్యులు రమణరావు ఫిర్యాదుతో కదిలిన డొంక
దర్యాప్తు చేసిన టెక్కలి వైద్యులు సూర్యారావు


