రిమ్స్ సెక్యూరిటీ గార్డుల సమ్మె నోటీసు
శ్రీకాకుళం: రిమ్స్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్‌ుడ్సకు జీఓ ప్రకారం నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించని శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం నిరంకుశ వైఖరికి నిరసగా సెక్యూరిటీ ఉద్యోగులు శనివారం సమ్మె నోటీసు అందజేశారు. జీతాలు అందక తాము పడుతున్న ఇబ్బందులను తెలియజేస్తూ రిమ్స్ సూపరింటెండెంట్ కార్యాలయంలో రిమ్స్ కాంట్రాక్టు అండ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ సభ్యులు ఈ నోటీసు అందించారు. జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఎమ్మెల్యే వరకు అందరికీ వినతిపత్రాలు అందించామని ఫలితం దక్కలేదని, చివరకు నాలుగు నెలలుగా జీతాలు నిలిపేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె నోటీసు ఇస్తున్నామని తనుకు సంతోష్, రాంబిల్లి బండారి, ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రదాన కార్యదర్శి దుర్గాసి గణేష్, మామిడి సూర్యనారాయణ తదితరులు పేర్కొన్నారు. యాజమాన్యం మొండితనమే సమ్మెకు కారణమన్నారు. 14 రోజుల్లో సమస్యలు పరిష్కరించి జీతాలు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో అన్నెపు సూర్యనారాయణ, సతివాడ రాజేంద్రప్రసాద్, మిర్తిపాటి హైమారావు, దామోదర రవికుమార్ పాల్గొన్నారు.


