పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గాయిత్రి ప్రతిభ
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ (అటానమస్) కళాశాలకు చెందిన చల్లా గాయిత్రి రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో రెండు బంగారు పతకాలు సాధించి శభాష్ అనిపించింది. బీఏ సెకెండియర్ చదువుతున్న గాయిత్రి ‘ఒలింపియాడ్ అసోసియేషన్ ‘తగరపువలస, రవి ప్రో ఫిట్నెస్ జోన్’ విశాఖపట్నంలో ఇటీవల నిర్వహించిన ఓపెన్ స్టేట్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో జూనియర్స్, సీనియర్స్ రెండు కేటగిరీల్లోనూ విజేతగా నిలిచింది. మంగళవారం కళాశాలకు చేరుకున్న గాయిత్రిని ప్రిన్సిపాల్ డాక్టర్ కింతలి సూర్యచంద్రరావు అభినందించారు. క్రీడల్లో నైపుణ్యం ద్వారా ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయన్నారు. కార్యక్రమంలో కళాశాల పీడీ డాక్టర్ కె.మోహన్‌రాజ్, డాక్టర్ ఎస్.పద్మావతి, డాక్టర్ ఎన్.చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.


