నా మాటలు వక్రీకరించారు
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
నరసన్నపేట : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో తనకు విడదీయలేని అనుబంధం ఉందని, వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా టెక్కలిలో తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తన మాటల్లో స్వార్థం లేదని, పార్టీ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. తన మాటల వెనుక ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని, సామాజిక వర్గాలను రెచ్చగొట్టడం తన అభిమతం కాదని స్పష్టం చేశారు. ఒక వేళ తన మాటలు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే వాటిని తప్పుగా భావించొద్దని కోరారు. తప్పుడు ప్రచారాన్ని పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని కోరారు.


