శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో సంస్కృతం సబ్జెక్టు లో బోధనకు గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శ్రీరాములు తెలిపారు. సంస్కృతం సబ్జెక్టు లో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌తోపాటు పీహెచ్‌డీ, నెట్/ఏపీ సెట్ అర్హతలు కలిగిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందన్నారు. బోధన నైపుణ్యం, మౌఖిక పరీక్ష, ఉన్న త అర్హతల వెయిటేజీ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుందన్నారు. బయోడేటా, విద్యార్హతల తో కూడిన దరఖాస్తులను నేడు (17న) సాయంత్రంలోగా కళాశాలలో సమర్పించాలని, ఇంటర్వ్యూ శనివారం ఉదయం 10 గంటల కు కళాశాలలో జరుగుతుందని, అన్ని ఒరిజిన ల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ప్రిన్సిపాల్ శ్రీరాములు కోరారు.
పలాస: పలాస మండ లం బొడ్డపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని రాపాక ఝాన్సీ రాష్ట్ర స్థా యి స్కూలు గేమ్స్ పోటీలకు 14 ఏళ్ల విభాగంలో ఎంపికై ంది. అథ్లెటిక్స్‌లో లాంగ్‌జంప్, హైజంప్, 200 మీటర్ల పరుగుపందెంలో జిల్లా ఎంపిక లో మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఆమె రాష్ట్ర స్థాయిలో శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం జిల్లా పరిష త్ ఉన్నత పాఠశాలలో నవంబరు 8, 9, 10 తేదీల్లో జరుగునున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో ఝాన్సీ పాల్గొనున్నారని బొడ్డపాడు హైస్కూ లు పీడీ పద్మలోచన్ చెప్పారు. ఆమె రాష్ట్ర స్థా యికి ఎంపిక కావడంపై బొడ్డపాడు ఉపాద్యాయులు ఆమెను అభినందించారు.
సారవకోట: మండలంలోని మహాశింగి పంచా యతీ కన్నయ్యగూడ గ్రామానికి రోడ్డు నిర్మించాలని ఆ గ్రామస్తులు ఎస్టీ కమిషన్‌కు కొన్ని రోజుల కిందట విన్నవించారు. ఎస్టీ కమిషన్ సూచనల మేరకు సర్వే విభాగం ఏడీ వెంకటరా వు, డీఐఓ జనార్ధనావులతో స్థానిక తహసీల్దార్ విజయలక్ష్మి మహాశింగి నుంచి కన్నయ్యగూడ కు రోడ్డు నిర్మాణం కోసం పరిశీలన చేశారు. 15 ఏళ్ల కిందట సీతంపేట పరిసర ప్రాంతాల నుంచి కొన్ని కుటుంబాలు వచ్చి ఇక్కడ పోడు వ్యవసాయం చేస్తూ బతుకుతున్నాయని, వీరు పంచాయతీ కేంద్రానికి రావాలంటే సరైన దారి లేదు. మండల, జిల్లాస్థాయి అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): సంక్షేమ హాస్టల్‌లో మౌలిక వసతులు లేక విద్యార్థులు దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేకపోవడం దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఎం నగర కన్వీనర్ ఆర్.ప్రకాశరావు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగరంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లను సీపీఎం ప్రతినిధి బృందం గురువారం పరిశీలించింది. ఈ సందర్భంగా విద్యార్థులు అనేక సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. జిల్లాలో ఎస్సీ హాస్టల్స్ 31, బీసీ హాస్టల్స్ 78, ఎస్టీ హాస్టల్స్ 60 ఉన్నాయని, వీటిల్లో కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించని వారు జిల్లాలో విమానాశ్రయాలు నిర్మిస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తక్కువ మెనూ చార్జీలతో అరకొర భోజన సదుపాయాలు అందుతున్నాయన్నారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు జిల్లా మంత్రులకు పట్టవా అని ప్రశ్నించారు. వర్షం పడితే ఎస్సీ హాస్టల్ మొత్తం నీటితో నిండిపోతుందని, ఎస్సీ హాస్టల్ విద్యార్థులు ఎస్టీ హాస్టల్‌కి వెళ్లి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఎస్టీ హాస్టల్‌లో గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్‌లో ఒక్కో హాల్ ఉన్నాయని, అందులోనే 200 మంది విద్యార్థులందరూ సామూహికంగా నిద్రించడం, భోజనం చేయడం, చదువుకోవడం చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం ప్రతినిధి బృందం నాయకులు ఎం.గోవర్ధనరావు, పి.సుధాకర్, కె.సూరయ్య, ఎల్.మహేష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.