
రాజకీయ ఒత్తిళ్లకు పోలీసులు బలికావద్దు
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
పలాస: రాజకీయ ఒత్తిళ్లకు పోలీసులు బలి కావద్దని, శాంతిని కోరుకునే జిల్లాలో హింసను ప్రోత్సహించవద్దని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు కోరారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. కల్తీ మద్యం నిరసనకు సంబంధించి జరుగుతున్న వ్యవహారంపై ఆరా తీశారు. పోలీసులు వైఎస్సార్ సీపీ శ్రేణులను రెచ్చగొడుతున్నారని, ఇది సరికాదన్నారు. ప్రభు త్వం ఇలాంటి చర్యలకు పాల్పడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, త్వరలో గుణపాఠం చెబుతారని అన్నారు. అప్పలరాజును పరామర్శించిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, స్థానిక వైఎస్సార్ సీపీ నేతలు తదితరులు ఉన్నారు.