
షిర్డీసాయిబాబా మందిరంలో చోరీ
పాతపట్నం: పాతపట్నం ఆల్‌ఆంధ్ర రోడ్డు సమీపంలోని షిర్డీగిరిపై షీర్డీ సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. ఎస్‌ఐ కె.మధుసూదనరావు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం షిర్డీసాయి బాబా మందిరం వెనుక పక్క ఉన్న వెంటిలేటర్ రంధ్రం ద్వారా దొంగలు లోపలికి వెళ్లి 500 గ్రాముల వెండి పల్లెం, పెట్టెలో రూ.23,150 నగదు, హుండీ కానుకలను చోరీ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు భక్తులు వచ్చి చూసేసరికి చోరీ జరిగిందని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్ టీం వచ్చి మందిరం, హుండీని పరిశీలించారు. సీసీ కెమెరాల వైర్లు తెంచినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.