
స్క్రీన్‌పై పాఠాలు!
దీక్షా యాప్‌లో ఎన్‌సీఈఆర్‌టీ, స్టేట్ సిలబస్‌లు
ప్రతి పుస్తకంపైనా క్యూఆర్ కోడ్
సులువుగా అర్ధమయ్యేలా రూపకల్పన
ప్రభుత్వం కల్పించిన ఈ సౌకర్యంపై విద్యార్థులకు అవగాహన కలిగిస్తున్నాం. వివిధ కారణాల వల్ల పాఠశాలలకు రాని వారు ఈ యాప్ ద్వారా పుస్తకాలపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పాఠ్యాంశాలు సులభంగా చదువుకోవచ్చు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– బి.ధనుంజయ్, ఎస్‌జీటీ,
రాళ్లపాడు ఎంపీపీ స్కూల్, పోలాకి మండలం
విద్యార్థుల సౌలభ్యం కోసం దీక్షా యాప్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలపై కూడా క్యూఆర్ కోడ్ ముద్రించారు. యాప్ ద్వారా పాఠ్యాంశాలపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే విద్యార్ధులు సులువుగా పాఠాలు చదవవచ్చు.
– యు.శాంతారావు, ఎంఈఓ, నరసన్నపేట
నరసన్నపేట : అనారోగ్యంతో పాఠశాలకు వెళ్లకున్నా.. ఒకవేళ వెళ్లినా పాఠాలు సరిగ్గా అర్ధం కాకున్నా విద్యార్థులు చదువులో వెనుకబడిపోతున్నారు. అలాంటి విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం దీక్ష యాప్ అందుబాటులోనికి తెచ్చింది. అందులో ఎన్‌సీఈఆర్‌టీతో పాటు స్టేట్ సిలబస్ పుస్తకాలను కూడా పొందుపరిచారు. విద్యార్థులు సులువుగా పాఠ్యాంశాలను మొబైల్ ఫోన్ స్క్రీన్ ద్వారా చదువుకునేలా రూపకల్పన చేశారు.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే..
జిల్లాలో 2955 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 264804 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి సరఫరా చేసిన అన్ని పాఠ్య పుస్తకాలపైనా క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. పాఠ్యాంశంపై విద్యార్థులు పూర్తి పట్టు సాధించేందుకు నిపుణుల ద్వారా దీక్షా యాప్‌ను పొందుపరిచారు. యాప్‌ను సెల్‌ఫోనులో డౌన్ లోడ్ చేసుకొని పుస్తకాలపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి అర్ధంకాని పాఠ్యాంశాన్ని సులువుగా అవగాహన అయ్యేలా రూపొందించారు. ఆడియో, వీడియో, క్విజ్, అసైన్మెంట్ వంటి సౌకర్యాలు కల్పించారు. ముఖ్యంగా ప్రత్యేక అవసరాల పిల్లలకు ఆడియో పాఠాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
సెల్‌ఫోన్‌లో ప్లేస్టోర్ నుంచి దీక్షా యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.అందులోకి వెళ్లి వివరాలు నమోదు చేయాలి. అనంతరం విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను సెల్‌ఫోన్‌తో స్కాన్ చేస్తే వెంటనే పాఠ్యాంశం తెరపై కనిపిస్తుంది.
క్యూఆర్ కోడ్‌తో ఉన్న పాఠ్య పుస్తకాలు

స్క్రీన్‌పై పాఠాలు!

స్క్రీన్‌పై పాఠాలు!