
సెమినార్ విజేతలకు ప్రశంసాపత్రాలు
శ్రీకాకుళం: నగరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి సైన్స్ సెమినార్‌లో విజేతలకు డీఈఓ రవిబాబు ప్రశంసాపత్రాలను అందజేశారు. క్వాంటం ఏజ్ బిగిన్స్ పొటెన్షియల్స్ అండ్ చాంలెంజర్స్ అనే అంశంపై జిల్లాస్థాయి సెమినార్ నిర్వహించారు. ఇందులో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మోడల్ స్కూల్ విద్యార్థి పి.అభిషేక్ కుమార్ రెడ్డి, హయాతినగరం ఎంజేపీబీఎస్ పాఠశాల విద్యార్థి పి.హేమలత ద్వితీయ స్థానాన్ని సాధించారు. వీరు ఈ నెల 18న విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు. వీరిని డీఈఓతో పాటు ఉప విద్యాశాఖ అధికారి ఆర్.విజయ్‌కుమారి, సైన్స్ ఆఫీసర్ ఎం.కుమారస్వామి, ప్రధానోపాధ్యాయులు పి.సతీష్‌కుమార్, సూర్యప్రకాష్ తదితరులు అభినందించారు.